Monday, May 6, 2024

మల్లన్నకు 14 రోజుల రిమాండ్

- Advertisement -
- Advertisement -

Teenmar mallanna remanded for 14 days

హైదరాబాద్: కల్లు వ్యాపారి వద్ద తీన్మార్ మల్లన్న బృందం డబ్బులు డిమాండ్ చేసిన ఆరోపణలపై మల్లన్న సహా ఐదుగురిపై నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మల్లన్నను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. కాగా తన భర్తపై అక్రమ కేసులు పెట్టి మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని మల్లన్న భార్య జాతీయ బిసి కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. స్పందించిన కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి.. దీనిపై సమగ్ర విచారణ జరపాలని.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డిని కోరారు. విచారణ జరిపి నివేదికను పరిశీలించిన కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. సంబంధిత రికార్డులన్ని తీసుకుని ప్రత్యక్షంగా కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపిలు స్టే కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఉన్నత న్యాయస్థానం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News