Monday, April 29, 2024

వాయుసేన మరింత బలోపేతం

- Advertisement -
- Advertisement -

Purchase of 56C295 medium transport aircraft from Spain

స్పెయిన్‌నుంచి 56 సి295 మీడియం ట్రాన్స్‌పోర్ట్ విమానాల కొనుగోలు
ఎయిర్ బస్‌తో ఒప్పందంపై రక్షణ శాఖ సంతకాలు

న్యూఢిల్లీ: స్పెయిన్‌కు చెందిన ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్‌తో భారత రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం భారీ ఒప్పందం కుదుర్చుకుంది. సుమారు రూ.20,000 కోట్ల విలువైన ఒప్పందంలో భాగంగా 56 సి295 మీడియం ట్రాన్స్‌పోర్ట్ విమానాలను కొనుగోలు చేస్త్తోంది. భారత వాయుసేనలోని పాతబడిన ఆవ్రో748 విమానాలకు బదులుగా వీటిని కొంటోంది. ఈ విమానాలను కొనుగోలు చేయాలనే ప్రతిపాదన చాలాకాలంగా పెండింగ్‌లో ఉంది. ఈ ప్రతిపాదనకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ రెండు వారాల క్రితమే ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఎ భరత్ భూషణ్ బాబు ఇచ్చిన ట్వీట్‌లో రక్షణ మంత్రిత్వ శాఖ , స్పెయిన్‌కు చెందిన ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ మధ్య ఒప్పదం కుదిరినట్లు తెలిపారు. 56 సి295 విమానాలను వాయుసేన కోసం సేకరిస్తున్నట్లు తెలిపారు.

వీటిలో 16 విమానాలను ఫ్లైఅవే కండిషన్‌లో 48 నెలల్లో స్పెయిన్ మన దేశానికి అందజేస్తుంది. మిగిలిన విమానాలను మన దేశంలోనే తయారు చేస్తారు. ఎయిర్‌బస్ డిఫెన్స్‌అండ్ స్పేస్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ కన్సార్టియం వీటిని తయారు చేస్తుంది. వీటిని ఒప్పందంపై సంతకాలు జరిగినప్పటినుంచి పదేళ్లలో తయారు చేసి అందజేస్తాయి.సైనిక విమానాలను ఒక ప్రైవేటు కంపెనీ మన దేశంలో తయారు చేయడం ఇదే మొదటిసారి. సి295 విమానం 510 టన్నుల సరకును రవాణా చేయగలదు. ఈ ఒప్పందం ద్వారా కొనుగోలు చేస్తున్న 56 విమానాల్లో దేశీయ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ను అమర్చుతారని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆవ్రో748 విమానాలను మార్చాలనే నిర్ణ్ణయాన్ని తొమ్మిదేళ్ల క్రితమే తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News