Monday, May 6, 2024

తెలంగాణ ఎంసెట్ ప్రారంభం….

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ పరీక్ష బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉండడంతో విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో విద్యార్థులను థర్మల్ స్క్రీనింగ్ చేసి చేతులను శానిటైజర్ తో శుభ్రం చేసిన అనంతరం లొపలికి పంపించారు. పరీక్షా కేంద్రాలను శానిటైజ్ చేశారు. విద్యార్థులు భౌతికి దూరం పాటిస్తూ  పరీక్షా కేంద్రాల్లోకి రావాలని అధికారులు సూచించారు. పరీక్ష కేంద్రాల్లో బయోమెట్రిక్ బదులు ఫేస్ రికగ్నైజేషన్ తో ఫోటోలు తీసుకున్నారు. సెకండ్ సెషన్ లో మధ్యాహ్నం మూడు గంటలకు పరీక్ష ప్రారంభంకానుంది. తెలంగాణ 79, ఎపిలో 23 కేంద్రాల్లో ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో అగ్రి కల్చర్ ఎంసెట్ పరీక్ష జరగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News