Saturday, April 27, 2024

తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవం టిఆర్‌ఎస్

- Advertisement -
- Advertisement -

Telangana Existence Self Respect TRS

అత్యంత ఘనంగా పార్టీ 21వ ఆవిర్భావ వేడుకలు

ప్రతినిధుల సభకు 3వేల మంది
హాజరు..ప్రత్యేక పాసుల జారీ
ఆహ్వానాలు అందిన వారే
సభకు హాజరు విజ్ఞప్తి
పార్టీ నేతలతో కలిసి హెచ్‌ఐసిసి
వేదికను పరిశీలించిన టిఆర్‌ఎస్
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
నేడు జిహెచ్‌ఎంసికి చెందిన    
నేతలతో ప్రత్యేక సమావేశం

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ఆత్మగౌరవానికి, అస్తితత్వానికి ప్రతీకగా టిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించిందని, నేపథ్యంలో 21వ ఆవిర్భావ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించనున్నామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. అందులో భాగంగానే ఈ నెల 27వ తేదీన నగరంలోని హెచ్‌ఐసిసి ప్రాంగణం లో పెద్దఎత్తున పార్టీ ప్రతినిధుల మహాసభను త లపెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావ ప్రతినిధుల సభ కోసం ప్రత్యేకంగా నాయకులకు ఆహ్వానాలు పంపుతున్నామని, అందిన వా రే సభకు హాజరుకావాలని కెటిఆర్ విజ్ఞప్తి చేశా రు. ఏర్పాట్లపై ఆదివారం జిల్లా పార్టీ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ నియోజకవర్గం శాసనసభ్యుడు మాగంటి గోపినాథ్, ఎంఎల్‌సి నవీన్‌రా వు తదితరులతో కలిసి మంత్రి కెటిఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ, టిఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు పండుగగా జరుపుకుంటారన్నారు. పార్టీ అధినేత, ము ఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో ప్ర తినిధుల సభ భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఆవిర్భావ వేడుకకు సుమారు 3000 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు. ఈ సభలో పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రధాన అంశాలపై కూలంకషంగా చర్చించడం జరుగుతుందన్నారు. ప్రధానంగా పార్టీ ఆవిర్భానం నుంచి మొదలుకుని పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల కోసం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కూడా సింహావలోకనం చేస్తామన్నారు. అలాగే కేంద్ర రాజకీయాల్లో పార్టీ పోషించాల్సిన పాత్ర తదితర అంశాలపై కూడా సభలో చర్చకు వచ్చే అవకాశముందని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి కెటిఆర్ వెల్లడించారు. అందువల్ల ప్రతినిధుల మహాసభను ఘనంగా జరుపుతామన్నారు. పార్టీ ఆవిర్భావ సభ కోసం రాష్ట్రాన్ని పూర్తిగా గులాబీమయంగా మార్చుతామని కెటిఆర్ వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీల్లో పార్టీ గ్రామ శాఖల అధ్యక్షులు వారి వారి గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరిస్తారననారు. అలాగే 3600 పట్టణ ప్రాంతాల్లో కూడా జెండా ఆవిష్కరణలు జరుగుతాయన్నారు. ఇక ప్రతినిధుల సభకు వచ్చే వారిని ఆహ్వానించేందుకు నగరానికి నాలుగువైపులా అందమైన స్వాగత వేదికలను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు.

అలాగే పలు ట్రాఫిక్ ఐలాండ్‌లతో పాటు ముఖ్యమైన కూడళ్లను కూడా పార్టీ పతాకాలు, బట్టింగ్స్‌ను ఏర్పాటు చేస్తామమని కెటిఆర్ తెలిపారు. ఇక సభకు వచ్చిన వారికి కూడా ఎలాంటి అసౌకర్యం కలుగుకుండా సంబంధిత జిల్లా మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులకు ఎప్పటికప్పుడు తగు సూచనలు ఇస్తామన్నారు. పార్టీ అధిష్టానం జారీ చేసిన సమాచారాన్ని వారు పార్టీ ప్రతినిధులకు అందిస్తారన్నారు. ఇక పార్టీ కటౌట్లు, జెండాలను, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసే ముందుగానే జిహెచ్‌ఎంసి అధికారుల నుంచి పార్టీ పరంగా అనుమతులు తీసుకుని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఆ నిబంధనలను టిఆర్‌ఎస్ పార్టీ విధిగా పాటిస్తుందన్నారు. పార్టీ శ్రేణులకు కూడా అదే రీతిలో ఆదేశాలు కూడా ఇసాస్తున్నామని కెటిఆర్ వెల్లడించారు. జిహెచ్‌ఎంసి పరిధిలోని పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో సోమవారం ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కెటిఆర్ తెలిపారు. ఈ సమావేశంలో నగర అలంకరణ ఏర్పాట్లు, సభా వేదిక, సభకు హాజరయ్యే ప్రతినిధుల కోసం కల్పించాల్సిన సౌకర్యాలతో పాటు పలు అంశాలపై చర్చించనున్నామని కెటిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News