Tuesday, April 30, 2024

‘అయ్యో’ రామచంద్రా!

- Advertisement -
- Advertisement -

telangana graduate mlc election results 2021

వరస ఓటమిలు, ఖంగుతిన్న రాంచందర్ రావు

హైదరాబాద్: వరస ఎన్నికలు బిజెపి నేత ఎన్.రామచంద్రర్ రావుకు కలిసి రానట్లు ఉంది. వరస ఓటమితో ఆయన ఖంగు తినే పరిస్థితి ఏర్పడింది. శాసన సభ మొదల్లో ఎంపి, చివరికి ఎమ్మె ల్సీ ఎన్నికల్లో సైత ఓటమి పాలైయ్యారు. చివరికి తన సిట్టింగ్ సీటును సైతం రాంచందర్ రావు కోల్పొ య్యారు. తెలంగాణ ఏర్పడిన తొలి నాళ్లలో పూర్తిగా టిఆర్‌ఎస్ హవా కొనసాగుతున్న తరుణంలో కూడా తమ సమస్యలను పరిష్కరిస్తారన్న ఎంతో విశ్వాసంతో 2015లో జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో ఆయనకు గ్రాడ్యుయేట్స్ ప్రథమ ప్రాధాన్యత ఓట్లతోనే విజయం కట్టబెట్టారు. అయితే ఆయన ఉద్యోగుల సమస్యలు మొదలు నిరుద్యోగ సమస్యలపై పెద్దగా పోరాడక పోగా, కనీసం సమస్యలను వినేందుకు కూడా అందుబాటులోనే లేరనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేక పోయ్యారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే 2018 జరిగిన ముందుస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసి ఓటిమిని చవి చూశారు.

ఆ తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఇదే నియోజకవర్గం నుంచి బరిలో దిగగా ఆ ఎన్నికల్లో సైతం ఆయనకు ఓటమి తప్పలేదు. ఆ తర్వాత ప్రస్తుతం జరిగినా మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసినా ఆయన తన సిట్టింగ్ స్థానమైనప్పటీకీ ఓటమి పాలు కాక తప్పలేదు. రాంచందర్ రావు ఎన్నికల సమయంలో తప్పిస్తే మిగిలిన సమయాల్లో ప్రజలకు పెద్దగా అందుబాటులో ఉండకపోవడంతో పాటు నగరంలో ఏ ఎన్నిక జరిగినా ఆయనే పోటీ చేస్తుండడంతో బిజెపి శ్రేణుల్లో సైతం కొంత అసంతృప్తి నెలకొంది. నగరంలో పలువురు నాయకులున్నప్పటికీ ఎవరికీ అవకాశం ఇవ్వకుండా ఏ ఎన్నికైనా తానే అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో ఆ పార్టీ శ్రేణులు ఆయనకు పెద్దగా సహకరించపోవడం కూడా ఆయన ఓటిమికి ఓ కారణమని కూడా వినిపిస్తోంది. దీంతో ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి పోటీని ఇచ్చిన్పటికీ ఓటమి పాలు కాక తప్పని పరిస్థితి ఏర్పడిందనేది టాక్..

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News