Saturday, May 11, 2024

రైతు రుణమాఫీ, ఆర్టీసీ విలీనంపై…

- Advertisement -
- Advertisement -

శాసన మండలిలో ధన్యవాద తీర్మానాలు ప్రవేశపెట్టిన ఎంఎల్‌సిలు కవిత, ప్రభాకర్‌రావు

హైదరాబాద్ : రైతు రుణమాఫీ సహా ఆర్‌టిసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం పట్ల ప్రభుత్వాన్ని, సిఎం కెసిఆర్‌ను అభినందిస్తూ బిఆర్‌ఎస్ ఎంఎల్‌సిలు కవిత, ప్రభాకర్‌రావు గురువారం శాసనమండలిలో తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రైతు రుణమాఫీ చేయడం పట్ల ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టగా, ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం పట్ల అభినందిస్తూ బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి, శాసనమండలి విప్ ఎంఎస్ ప్రభాకర్ రావు మరో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

రాష్ట్రంలోని రైతుల రుణాలను మాఫీ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం అభినంద నీయమని వారన్నారు. రైతులకు రూ. 19వేల కోట్ల రుణాలను మాఫీచేస్తామని ప్రకటించి, గురువారం నుంచే రుణాలను మాఫీ చేయడం ప్రారంభించడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. టిఎస్‌ఆర్‌టిసీ సంస్థను విలీనం చేయడంతో ఆర్‌టిసిలో పనిచేస్తున్న 43,373 మంది కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారని వెల్లడించారు. సంస్థ పరిరక్షణతో పాటు, ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News