Thursday, May 16, 2024

ఇంకో ఇరువై ఏండ్లు సారూ..కారే

- Advertisement -
- Advertisement -

 

సోషల్‌మీడియా ఫీడ్‌బ్యాక్ చూస్తుంటే ప్రజల్లో ఆ అభిప్రాయం బలంగా ఉంది
కెసిఆర్‌పై నమ్మకంతోనే ప్రజలు ఆయన పక్షాన ఉన్నారు
నేడు టిఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవాన కార్యకర్తలు ఇండ్లపైనే జెండాలు ఎగురవేయాలి
విపత్కర పరిస్థితుల్లోనే నాయకత్వ పటిమ తెలుస్తుంది, కరోనా నేపథ్యంలో ప్రధాని మోడీకి సిఎం కెసిఆర్ అనేక విలువైన సూచనలు చేశారు
మీడియా చిట్‌చాట్‌లో టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : రెండు దశాబ్దాల సుధీర్ఘ ప్రయాణంలో టిఆర్‌ఎస్ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ప్రజల తో మమేకమై అద్భుతాలను ఆవిష్కరించిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి, పురపాలక శాఖమం త్రి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఉద్ఘాటించారు. దేశరాజకీయాల్లో పార్టీ ప్రత్యక్షంగా ప్రభావం చూపలేక పోయినప్పటికీ తన పథకాలు, కార్యక్రమాలతో పరోక్షంగా ప్రభావితం చేస్తోందని తెలిపారు. టిఆర్‌ఎస్ ముద్ర భారతదేశ రాజకీయ యవనికపై స్పష్టంగా అగుపిస్తోందని చెప్పారు. 20 ఏళ్ల టిఆర్‌ఎస్ పార్టీ ప్రస్థానం జలదృశ్యం ను ంచి ఈ నాటి సుజల దృశ్యం వరకు ఆవిష్కృత ం అయిందని ఆదివారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ తెలిపారు. పార్టీ ఆవిర్భవి ంచి ఇరవై ఏళ్లలోకి అడుగు పెడుతున్న సందర్భ ంగా రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన అనేక సందర్భాలను ఆయన నెమరు వేశారు. జలదృశ్యంలో పురుడు పోసుకున్న టిఆర్‌ఎస్ లెక్కకు మించిన విజయాలను సొంతం చేసుకుంటుందంటే దీనికి ప్రధాన కారణం కచ్చితంగా కెసిఆర్ నాయకత్వమేనన్నారు.

ఏ పార్టీ మద్దతు లేకుండా అన్ని స్థాయిల్లో జరిగిన ఎ న్నికల్లో ఏకపక్షంగా గెలిచిన పార్టీ దేశంలో బ హుషా టిఆర్‌ఎస్ పార్టీ ఒకటేనని ఆయన చె ప్పారు. ప్రస్తుతం అన్ని జిల్లాల్లోనూ టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాలు సిద్ధమయ్యాని, ప్రస్తుత సంక్షోభం ముగిసిన తరువాత ప్రారంభోత్సవాలతో పాటు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలనే ఆలోచన ఉన్నట్లు చెప్పారు. ప్రజాజీవితంలో ఉండి మనగలిగిన ప్రాంతీయ పార్టీలు రాష్టంలో రెండు ఉండగా అందులో ఒకటి టిడిపి తెలంగాణలో మాయం అయిందన్నారు. 60 లక్షల సభ్యులతో రాష్ట్రంలో టిఆర్‌ఎస్ అజేయమైన శక్తితో ఉందని, అందుకు తెలంగాణ ప్రజలకు, టిఆర్‌ఎస్ సైనికులకు పేరుపేరునా పాదాభివందనాలని కెటిఆర్ చెప్పారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో పాటు ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో సిఎం కెసిఆర్ వ్యవహరిస్తున్న తీరును ప్రజలు ఆశీర్వదిస్తూ మరో 15 నుంచి 20 ఏళ్లు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారని కెటిఆర్ చెప్పారు. సిఎం కెసిఆర్ కార్యదక్షత ఈ విపత్కరపరిస్థితుల్లో చూసిన అనంతరం సోషల్‌మీడియా ఫీడ్‌బ్యాక్ చూస్తుంటే కెసిఆర్ నాయకత్వం మరో 20 ఏళ్లు అవసరమనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. సిఎం కెసిఆర్‌కు ఉండే క్లారిటీ, విషయపరిజ్ఞానం, ప్రజలకు ఇచ్చే నమ్మకం మరో ఇరవై ఏళ్లు రాష్టానికి అవసరమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

దేశానికి తెలంగాణ మోడల్‌గా మారింది
దేశంలో ఇప్పటివరకు గుజరాత్ మోడలని,బెంగాల్ మోడల్ అంటూ చెప్పావారు కానీ ప్రస్తుతం కొత్తచర్చ జరుగుతోంది. టిఆర్‌ఎస్ నాయకత్వంలో తెలంగాణ మోడల్ అనే చర్చ నడుస్తోంది. అభివృద్ధి సాక్షాత్కారం అవుతుండటంతో దేశం యావత్తు రాష్ట్రం వైపు చూస్తోందన్నారు. కుల వృత్తులు, గ్రామీణ వ్యవస్థ, ఆర్థిర రంగం, వ్యవసాయంపై అపారమైన జ్ఞానం ఉన్న సిఎం కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో త్వరలోనే పంచ విప్లవాలు ఆవిష్కరించనున్నాయన్నారు. కొద్ది రోజుల్లో 90 మీటర్ల సముద్ర మట్టం నుంచి 618 మీటర్ల పైనుండే కొండపోచమ్మ సాగర్‌కు నీళ్లు రాబోతున్నాయి. జలవిప్లవం అద్భుతాలను సృష్టిస్తోందని చెప్పారు. ఆనాడు దాశరథి నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటే నేడు సిఎం కెసిఆర్ కోటి ఎకరాల మాగాణి లక్షంగా ముందుకు వెళ్తున్నారని చెప్పారు. స్పల్ప సమయంలో భారతదేశానికి బువ్వ పెట్టే స్థాయికి తెలంగాణ ఎదగనుందన్నారు.

తెలంగాణ యాస, భాషలకు ప్రాధాన్యత
స్వీయ రాజకీయ అస్థిత్వం తెలంగాణకు శ్రీరామరక్ష అన్న ప్రొఫెసర్ జయశంకర్ మాటలు నిజమవుతున్నాయని కెటిఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణ భాష, యాసలకు విలువ పెరింగిందన్నారు. ఏ అస్థిత్వం కోసం తెలంగాణ పోరాటం జరిగిందో అది సాధ్యమవుతుంటే సంతోషం వేస్తుందని చెప్పారు. ఒకనాడు తెలంగాణ భాషను జోకర్ భాషగా చూసారని ఇప్పుడు గౌరవం పెరిగిందన్నారు. అలాగే ఐటి, పరిశ్రమల్లో తెలంగాణ దూసుకుపోతుందన్నారు.

ఇళ్లపైనే పార్టీ జెండాలు ఎగరేయాలి
జరిగిన ప్రతి ఎన్నికల్లో సంపూర్ణ విజయం సాధించినప్పటికీ అనేక కారణాలతో విజయోత్సవాలు జరపుకోలేక పోతున్నామని కెటిఆర్ విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కరోనా విపత్కరపరిస్థితుల్లో సామాజిక దూరం పాటించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో టిఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకోవద్దని చెప్పారు. ఇళ్లపైన టిఆర్‌ఎస్ జెండాలు ఎగరవేసి సంఘీభావ సంకేతాన్ని ప్రకటించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడక్కడ రక్తం కొరత ఉండటంతో వారం రోజుల పాటు రక్తదానం చేయాలని కార్యకర్తలకు, టిఆర్‌ఎస్ అభిమానులను ఆయన కోరారు. ఈ నేపథ్యంలో తానుకూడా రక్తదానం చేసినట్లు చెప్పారు.

అప్పుడే నాయకత్వ పటిమ తెలుస్తుంది
విపత్కర పరిస్థితుల్లోనే నాయకత్వం పటిమ, వ్యూహం, ప్రజాసంక్షేమం కోసం తీసుకునే నిర్ణయాలతోనే నాయకత్వం బహిర్గతమవుతుందన్నారు. కరోనా నేపథ్యంలో ప్రధానికి సిఎం కెసిఆర్ అనేక సూచనలు చేశారు. హెలిక్యాప్టర్ మనీ సూచించారు. కానీ ఇప్పటి వరకు ప్రధాని ప్రకటించలేదు. బహుషా సోమవారం నాటి వీడియో కాన్ఫరెన్స్‌లో ఏవైనా ప్రకటిస్తారనే ఆశ ఉంది. కరోనా నిర్మూలన కోసం కేంద్రం సూచించిన మార్గదర్శకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. వలస కార్మికులు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములని, సిఎం కెసిఆర్ వారిని ఆదుకుంటున్నారు. కేరళ వారి బాధ్యత కాదంది, మరో రాష్ట్రం వలస కార్మికులను రాష్ట్రాలకు బస్సుల్లో పంపించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పేదలను, వలస కార్మికులను కడుపులో పెట్టుకుని కాపాడుతుందని కెటిఆర్ చెప్పారు. సిఎం కెసిఆర్ ఏది చెపితే అది చేస్తున్నారు. నాయకుడి మీద నమ్మకంతో ప్రజలంతా ఆయన పక్షాన ఉండటం సాధరణ విషయం కాదన్నారు.

టీ తాగుతారు కదా అని ఎగతాళిగా మాట్లాడారు
20 ఏళ్లలో ఎన్నో అవమానాలు, వైపల్యాలు ఎదుర్కొని అజేయమైన శక్తిగా టిఆర్‌ఎస్ ఆవిర్భవించి దేశానికి ఆదర్శమైందని కెటిఆర్ చెప్పారు. ఆంధ్రపాలకులు అడుగడుగునా అవమానించినా రాష్ట్రం కోసం ఓర్చుకుంటూ ఉద్యమాలను నిర్వహించినట్లు గుర్తు చేశారు. ఒకసారి సిఎం కిరణ్‌కుమార్ దగ్గరకు వెళ్లితే కాఫీ తాగుతావా టి తాగుతురా అని అడిగారు.. తాను కాఫీ అని అంటే, వెంటనే కిరణ్‌కుమార్ రెడ్డి అదేంటి తెలంగాణ వారు టీ తాగుతారు కదా అంటూ ఎగతాళి చేశారని గుర్తు చేశారు. ఇలా టిఆర్‌ఎస్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొందన్నారు. అయితే విజయాలకు పొంగిపోకుండా అపజయాలకు కుంగిపోకుండా కెసిఆర్ టిఆర్‌ఎస్‌ను బలోపేతం చేసి రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు. అందుకే ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తన ఆత్మకథలో కెసిఆర్ గురించి ప్రస్థావిస్తూ తన లక్ష్యాన్ని సాధించడంతో పాటు సాధించిన దానికి నాయకత్వం వహించడం ఎంతో గొప్ప విషయమన్నారని కెటిఆర్ గుర్తు చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా ద్వేషించిన వారు ఇప్పుడు కెసిఆర్‌ని అత్యధికంగా అభిమానిస్తున్నారని తెలిపారు.

Telangana has become model for the Country
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News