Saturday, April 27, 2024

వారంలో ఇంటర్ ఫలితాలు..?

- Advertisement -
- Advertisement -

 

Inter-Results

ఫస్టియర్ ఆధారంగా ద్వితీయ సంవత్సరం మార్కులు

హైదరాబాద్ : ఇంటర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్మీడియేట్ బోర్డు కసరత్తు చేస్తోంది. వారంలో ఇంటర్ ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకోగా, ఆ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు చర్యలు చేపడుతున్నారు. సెకండియర్ విద్యార్థులకు మార్కులను కేటాయింపుపై నియామకమైన నిపుణుల కమిటీని మంగళవారం ఇంటర్ బోర్డకు నివేదిక సమర్పించినట్లు తెలిసింది. ఈ కమిటీ రిపోర్టు ఆధారంగా విద్యార్థులకు మార్కులు కేటాయించనున్నారు. రాష్ట్రంలో 4,73,967 మంది విద్యార్థులు పరీక్షలు లేకుండానే పాస్ కానున్నారు. ఫస్టియర్‌లో ఫెయిలైన లేదా పరీక్షలకు గైర్హాజరైన విద్యార్థులకు కనీస మార్కులు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆధారంగా సెకండియర్ మార్కులు..?

ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మొదటి సంవత్సరం మార్కుల ఆధారంగా మార్కులు కేటాయించాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసినట్లు తెలిసింది. ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం ఫలితాల వెల్లడికి కమిటీని నియమించింది. ఈ కమిటీ వివిధ ప్రతిపాదనలపై అధ్యయనం చేసి విద్యాశాఖకు నివేదిక అందజేసినట్లు సమాచారం. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులందరినీ కనీస మార్కులతో పాస్ చేయడం లేదా వారికి మొదటి సంవత్సరంలో వచ్చిన మార్కులనే యథావిధిగా కేటాయించాలనే ప్రతిపాదనలపై కమిటీ అధ్యయనం చేసినట్లు తెలిసింది. కనీస మార్కులతో పాస్ చేస్తే ప్రతిభ కలిగిన విద్యార్థులకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రథమ సంవత్సరంలో వచ్చిన మార్కుల ఆధారంగానే ద్వితీయ సంవత్సరం మార్కులు కేటాయించేందుకు కమిటీ మొగ్గు చూపినట్లు సమాచారం. గత ఏడాది మొదటి సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులు, గైర్హాజరైన వారికి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ నిర్వహించలేదు. కాబట్టి వారిని పరీక్షలు లేకుండా పాస్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రథమ సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులకు, పరీక్షలకు గైర్హాజరైన విద్యార్థులకు 40 లేదా 45 మార్కులు కేటాయించేలా కమిటీ సిఫార్సు చేసినట్లు తెలిసింది. ఇంటర్ బైపిసి, ఎంపిసి విద్యార్థులకు ప్రాక్టికల్స్ విషయంలో రికార్డు ఆధారంగా మార్కులు నిర్దేశించనున్నట్లు సమాచారం. ఈ మేరకు కమిటీ ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News