Monday, May 6, 2024

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనం 30% పెంపు

- Advertisement -
- Advertisement -

కాంట్రాక్టు ఉద్యోగులకూ వర్తింపు
ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ
ప్రభుత్వ నిర్ణయంపై ఎంఎల్‌సి కవిత హర్షం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం 30 శాతం దాకా పెరిగింది. జెడ్‌పిటిసి, ఎంపిటిసి, సర్పంచ్‌లు ఎంతో కాలంగా గౌరవ వేతనాన్ని పెంచాలని చేస్తున్న అభ్యర్థనను ప్రభుత్వం ఆమోదించింది. వీరితో పాటు వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంటాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపుదలకు సంబంధించి ఆర్ధిక శాఖ మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. హోంగార్డులు, అంగన్‌వాడీ వర్కర్లు, అసిస్టెంట్లు, విలేజ్ రెవె న్యూ అసిస్టెంట్లు, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు, ఆశావర్కర్లు, సెర్ప్ సిబ్బంది వేతనాలు 30శాతం పెంచూతూ ఆదేశాలు జారీ చేసింది. బేసిక్ మీద 30శాతం పెంపుదల చేస్తూ ఈ మేరకు ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు అత్యవసర ఉత్తర్వులు జారీ చేశారు.

ఎంఎల్‌సిలు కవిత, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిల హర్షం

జెడ్పీటిసి, ఎంపిటిసిలు, సర్పంచ్‌లకు 30 శాతం జీతాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేయడంపై ఎమ్మెల్సీలు కవిత, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జీతాలు పెంపుపై వారు హర్షం వ్యక్తం చేశారు. జీతాలను పెంచి స్థానిక సంస్థల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల సమస్యలు, నిధులు, విధులు వంటి అంశాలపై ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో 12 మంది స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు పలు సమావేశాలు జరిపి సిఎం కెసిఆర్ దృష్టికి పలు సమస్యలను తీసుకెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News