Wednesday, May 1, 2024

ఇచ్చింది ఎక్కువ.. వచ్చింది తక్కువ

- Advertisement -
- Advertisement -

ఎనిమిదేళ్లలో మనం ఇచ్చింది రూ.3,65,797కోట్లు..
కేంద్రం తెలంగాణకు ఇచ్చింది రూ.1,68,000 కోట్లు

దేశానికి బువ్వ
పెడుతున్న రాష్ట్రాల్లో
మనకు 4వ స్థానం
ఆర్థిక స్వావలంబన
సాధించడం వల్లే
సంక్షేమ పథకాలు
ఐటి, పురపాలక శాఖ
మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/సిరిసిల్ల : కేంద్రానికి మనం ఇస్తున్నది ఎక్కువ.. మనకు కేంద్రం ఇచ్చింది మాత్రం చా లా తక్కువ.. దేశానికి బువ్వ పెడుతు న్న రాష్ట్రాల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉందని ఐటి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. గత 8 సంవత్సరాల్లో తెలంగాణ భారత దేశానికి ఆర్థిక చోదకశక్తిగా ఎదిగిందన్నారు. 8ఏండ్ల లో దేశానికి టాక్సుల రూపంలో రూ. 3,65,797 కోట్లు ఇవ్వగా దేశం నుం చి తెలంగాణకు కేవలం రూ.1,68, 000 కోట్లు మాత్రమే తిరిగి వచ్చాయన్నారు. రాష్ట్రం గత ఎనిమిదేళ్లలో ఆర్థికంగా స్వావలంబన సాధించడం వల్లే గొప్పగా సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నామన్నారు. శుక్రవారం సిరిసిల్లలోని బిసి స్టడీ సర్కిల్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ప్ర భుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షల కోసం శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు రెం డు లక్షల రూపాయల విలువైన స్టడీ మెటీరియల్‌ను అందించి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం నిధులు, నీళ్లు, నియామకాలు కోసమే సాగించామని, ఉమ్మడి రాష్ట్రంలో పుష్కలంగా గోదావ రి, కృష్ణా నదుల జలాలు, అరవై వేలకు పైగా చెరువులు ఉన్నప్పటికీ చిత్తశుద్ధి లేని నాయకత్వంవల్ల దుర్భిక్ష పరిస్థితులు తాండవించాయన్నారు.

సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాలు సాగునీరు సంగతి దేవుడెరుగు.. కనీసం తాగునీటికి నోచుకోక అరి గోస పడ్డాయన్నారు. సాధించుకున్న తెలంగాణలో బోర్లు వేసి బొక్కబోర్లా పడ్డ తెలంగాణను సాగు నీరు, తాగు నీటి రంగాల్లో స్వయం సమృద్ధి సాధించామన్నారు. 75 ఏండ్లలో ఎవ్వరు చేయలేని పని మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగు నీటిని అందించామన్నారు. దేశంలో నలభై కోట్ల ఎకరాల సాగుకు యోగ్యమైన భూమిఉందని, నదుల్లో 70 టిఎంసిల నీరు అందుబాటులో ఉందని, ఒక టిఎంసితో 10వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశాలున్నా.. పాలకులకు సోయి లేకపోవడంవల్లే దుర్భిక్ష పరిస్థితులు తలెత్తాయన్నారు. ఒక పక్క సమృద్ధిగా నీరు, మరో పక్కన దుర్భిక్ష ప్రాంతాలుండాల్సిన ఖర్మ పాలకులకు సోయిలేనందువల్లే దాపురించాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక మిషన్ కాకతీయ, కాళేశ్వరం సహా అనేక ప్రాజెక్టులు కట్టి తెలంగాణను దేశానికి ధాన్యపు భాండాగారంగా మార్చామని కెటిఆర్ అన్నారు.

సిరిసిల్ల జిల్లాలో మధ్యమానేరు ప్రాజెక్టు, అన్నపూర్ణ జలాశయాలు నిర్మించామన్నారు. సిరిసిల్ల ప్రాంతం సాగునీటితో స్వయం సమృద్ధి చెందాయని, ఆరు మీటర్లు పెరిగిన భూ గర్భజలాలు శిక్షణ ఐఏఎస్‌లకు ఓ పాఠ్యాంశంగా మారిందన్నారు. 2014లో తెలంగాణ వచ్చిన కొత్తలో తలసరి ఆదాయం 1,24,000 కాగా ఇప్పుడు తెలంగాణలో తలసరి ఆదాయం 2,78,000కు 130 శాతం వరకు పెరిగిందని ఆర్‌బిఐ ఈ విషయం చెప్పిందన్నారు. జిఎస్‌డిపి 2014లో తెలంగాణ వచ్చిన కొత్తలో 5,60,000కోట్లు కాగా, ప్రస్తుతం తెలంగాణ జిఎస్‌డిపి 11,55,000 కోట్లుగా 128 శాతం పెరిగిందన్నారు. ఇప్పటికీ జాతీయ తలసరి ఆదాయం 1,49,000 కోట్లు మాత్రమే అన్నారు. తెలంగాణ దేశంలోని 28 రాష్ట్రాలలో భౌగోళికంగా 11వ స్థానంలో, జనాభాలో 12వ స్థానంలో తెలంగాణ ఉందన్నారు.

నిధుల విషయంలో తెలంగాణ స్వయం సమృద్ధి సాధించిందని, దేశ నిర్మాణంలో గొప్ప పాత్ర పోషిస్తోందన్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు 8 లక్షలు మాత్రమే ఉన్నాయని, మొదటి ఐదేండ ్లకాలంలో 1,32,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. రెండో దఫా 81వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామన్నారు. దేశంలో ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థల్లో 35 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ప్రధాని మోడీ 10లక్షల పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారని.. ఆచరణలో అమలు కాలేదన్నారు. సిరిసిల్లలోని ఎస్‌సి స్టడీ సర్కిల్‌లో 500మందికి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ ఇస్తున్నామని, మరో 500 మందికి పోలీస్ శాఖ శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు. 1000మందికి పైగా అభ్యర్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మరో 134 స్టడీ సర్కిళ్లను సిఎం కెసిఆర్ మంజూరు చేశారన్నారు. సిరిసిల్లలో త్వరలోనే బిసి స్టడీ సర్కిల్‌కు శాశ్వత భవనం నిర్మిస్తామన్నారు. సిరిసిల్లను ఎనిమిదేండ్లలో విద్యాకేంద్రంగా తీర్చిదిద్దామన్నారు. ప్రతిభ ప్రాతిపదికనే ఉద్యోగావకాశాలుంటాయని అందువల్ల అభ్యర్థులు కొద్దిరోజులు సెల్ ఫోన్లు పక్కనపెట్టి అంకితభావంతో చదివితే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేజిక్కించుకోవచ్చన్నారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకుసాగాలని హితవుపలికారు.

దుబాయ్ జైలులో ఉన్న వారి విడుదలకు ప్రయత్నిస్తా

వివిధ కేసుల్లో దుబాయ్ జైలులో మగ్గుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులను విడుదల చేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రయత్నిస్తానని మంత్రి కెటిఆర్ భరోసా ఇచ్చారు. ఇక్కడ విలేఖరులతో ఆయన మాట్లాడుతూ అగస్టు మొదటి లేదా రెండవ వారంలో దుబాయ్‌కు వెళ్లనున్నట్టు తెలిపారు. జైలు జీవితం అనుభవిస్తున్న వ్యక్తుల కుటుంబ సభ్యులతో సహ దుబాయ్‌కు మంత్రి కెటిఆర్ పయనం కానున్నట్టు తెలిపారు. సిరిసిల్లా జిల్లా పెద్దూర్ వాసులను విడుదల కోసం చివరి ప్రయత్నంగా శాయశక్తుల కృషి చేస్తానని మంత్రి కెటిఆర్ అన్నారు. వారి విడుదల కోసం దుబాయ్ చట్టాల ప్రకారమే ముందుకు వెళాతామన్నారు. కార్యక్రమంలో జడ్పి చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి, మున్సిపల్ చైరపర్సన్ జిందం కళ, బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News