Thursday, May 16, 2024

ధాన్యం సేకరణలో రెండవ స్థానంలో తెలంగాణ: ఎఫ్‌సిఐ ట్వీట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. యాసంగిలో రైతులను నుంచి అధికమొత్తంలో ధాన్యం కొనుగోలు చేస్తూ దేశంలోనే రెండవ స్థానాన్ని కైసవం చేసుకుంది. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ విషయాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ) తన ట్విట్టర్ ద్వారా మంగళవారం వెల్లడించింది. ప్రస్తుత యాసంగి సీజన్‌లో దేశ వ్యాప్తంగా ధాన్యం, గోధుమల కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు మొత్తం 664.15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు ఎఫ్‌సిఐ పేర్కొన్నది. ధాన్యం సేకరణలో పంజాబ్ మొదటిస్థానంలో నిలవగా, తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని తెలిపింది. పంజాబ్ రాష్ట్రం 162.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, తెలంగాణ 83.97 లక్షల మెట్రిక్ టన్నులు, హర్యానా 64.23 లక్షల మెట్రిక్ టన్నులు, ఛత్తీస్‌గఢ్ 58.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఎఫ్‌సిఐ ప్రకటించింది.

రాష్ట్రంలో సాగునీటి అవసరమైన నీటి సరఫరా విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముఖ్యమంత్రి సిఎం కెసిఆర్ ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు రైతులకు ఇరవై నాలుగు గంటల పాటు నాణ్యమైన కరెంటును ఉచితంగా సరఫరా చేశారు. దీంతో ఈ సంవత్సరం వరి ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. రైతు తీసుకొచ్చిన ప్రతిగింజను కూడా సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసింది. 6,319 కోనుగొలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తోంది. ఫలితంగా ప్రస్తుత యాసంగి సీజన్‌లో పెద్దఎత్తున మన రాష్ట్రం ధాన్యం కొనుగోలు చేసినట్లు అయింది. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రం తరువాత తెలంగాణ రాష్ట్రం అధిక మొత్తంలో ధాన్యం ఎఫ్‌సిఐకి పంపుతోంది. ఇదిలా ఉండగా నెల 9వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా 50 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ట్విట్టర్‌లో పేర్కొన్న విషయం విదితమే. 50 లక్షల టన్నుల ధాన్యం సేకరణలో ఒక్క తెలంగాణలోనే(మే 7వ తేదీ నాటికి) 34.36 లక్షల టన్నుల ధాన్యం, ఎపి నుంచి 10 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

Telangana ranked second in grain procurement: FCI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News