Saturday, April 27, 2024

ధాన్యం సేకరణలో తెలంగాణ అగ్రభాగాన ఉంది: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Minister ktr

 

హైదరాబాద్: రబీలో ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన ఉందని మంత్రి కెటిఆర్ అన్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ట్విట్టర్‌ ద్వారా స్పష్టం చేశారని తెలిపారు. ధాన్యం సేకరణలో తెలంగాణ అగ్రస్థానంలో నిలవడం తెలంగాణ రైతులు, ప్రజానీకం గర్వించదగ్గ సందర్భమన్నారు. ఆరేళ్లలోపే సిఎం కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో అద్భుతమైన మార్పు కన్పిస్తోందని కెటిఆర్ పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా గోధుమలు, బియ్యం కొనుగోళ్లు చేశామని రాంవిలాస్ పాశ్వాన్ పేర్కొన్నారు. దేశంలోంచి 50 లక్షల టన్నుల బియ్యం కొనుగోలు చేసినట్టు పాశ్వాన్ తెలిపారు. 50 లక్షల టన్నుల బియ్యంలో తెలంగాణ, ఎపి వాటా 44.36 లక్షల టన్నులు. తెలంగాణ నుంచి 34.36 లక్షల టన్నులు కొనుగోలు చేశామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 10 లక్షల టన్నుల బియ్యం కొనుగోలు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.

Telangana tops country paddy procurement in Rabi season

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News