Monday, April 29, 2024

సంపదంతా పేదలు, రైతులకే..

- Advertisement -
- Advertisement -

ఇదే సిఎం కెసిఆర్ ఆకాంక్ష, మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి వేముల, సభ్యులకు కొత్త ట్యాబ్‌లు

Telangana wealth belongs to poor and farmers

మనతెలంగాణ/హైదరాబాద్: సంపదను పెంచి పేదలు, రైతులకు పంచాలన్నదే సిఎం కెసిఆర్ ఆకాంక్ష -మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. 202122 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శాసన శాసనసభా వ్య వహారాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఈ ఆరేళ్ల కాలంలో సాధిం చిన పురోగతిని ఆయన వివరించారు. రాష్ట్రం ఏ ర్పడిన నాడు పరిస్థితి అస్పష్టంగా, గందరగోళం గా ఉందన్నారు.

రాష్ట్ర ఏర్పాటుకు ముందు అన్ని రంగాల్లో తెలంగాణ వెనుకబడి ఉందని, టిఆర్ ఎస్ ప్రభుత్వం అస్పష్టతలను చేధిస్తూ కొత్త రాష్ట్రా నికి తగిన విధానాలను అవలంబిస్తూ అభివృద్ధి వైపు వేగంగా అడుగులు వేసిందన్నారు. తెలంగా ణ ప్రయోజనాలకు అనుగుణమైన పంథాలో ఆర్థిక ప్రణాళికలను రూపొందించిందన్నారు. ని ర్ధేశించుకున్న లక్ష్యాలను ఆశించిన సమయం లోనే సాధించిందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొ న్నారు. 60 ఏళ్ల కాలంలో కానీ అభివృద్ధి ఆరేళ్ల లో జరిగిందని, ఇది మన కళ్లముందు సాక్షాత్క రిస్తుందన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం సం క్షేమంలో మొదటి స్థానంలో ఉందన్నారు.

చిట్టాపూర్ లిఫ్ట్‌కు నిధులు కేటాయింపుపై సిఎంకు

కొత్తగా బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని చిట్టా పూర్ లిఫ్ట్‌కు నిధులు కేటాయించినందుకు ము ఖ్యమంత్రి కెసిఆర్‌కు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి నిజామా బాద్ జిల్లాలో సాగునీటి రంగానికి ప్రాధాన్యతని స్తూ కొత్త సాగునీటి లిఫ్ట్‌లకు బడ్జెట్ లో కేటా యింపులు చేయడం సంతోషకరమన్నారు. రాష్ట్ర బడ్జెట్ ముఖ్యమంత్రి కెసిఆర్ దార్శనికతకు నిద ర్శనమన్నారు. వ్యవసాయ, దాని అనుబంధ రం గాల్లో భారీ కేటాయింపులు చేసి సిఎం కెసిఆర్ రైతులపై తనకున్న ప్రేమను మరోసారి చాటుకు న్నారన్నారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న బా ల్కొండ నియోజకవర్గ రైతుల తరుపున కొత్తగా చిట్టాపూర్ లిఫ్ట్ కోసం నిధులు కేటాయించినందు కు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News