Monday, April 29, 2024

తెలంగాణ రెజ్లింగ్ జట్ల ఎంపిక

- Advertisement -
- Advertisement -

Telangana wrestling teams selections

మన తెలంగాణ/హైదరాబాద్: జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీల్లో పాల్గొనే తెలంగాణ పురుషులు, మహిళల జట్లను గురువారం ఎంపిక చేశారు. ఎల్‌బి స్టేడియంలోని రెజ్లింగ్ హాల్‌లో జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభను కనబరిచిన రెజ్లర్లను జాతీయ పోటీల్లో పాల్గొనే తెలంగాణ జట్లకు ఎంపిక చేశారు. ఫ్రీస్టయిల్, గ్రీక్ రోమన్ విభాగంలో జట్లను ఎంపిక చేయడం జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో నవంబర్ 10 నుంచి 13 వరకు ఈ పోటీలు జరుగనున్నాయి. ఇక జాతీయ పోటీలకు ఎంపికైన రెజ్లర్లను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి అభినందించారు. ఈ పోటీల్లో రాష్ట్ర రెజ్లర్లు పతకాల పంట పండించాలని ఆకాంక్షించా రు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెజ్లింగ్ సంఘం కార్యదర్శి నర్సింగ్ రావు, ఆర్గనైజర్, మహా తెలంగాణ కేసరి మహేశ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అస్లం, శాట్స్ కోచ్‌లు గోకుల్, విశ్వంబర్, సన్నీ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News