Saturday, April 27, 2024

వ్యవసాయ కార్మికులకు తక్షణ సాయంగా రూ.10 వేలు అందించాలి

- Advertisement -
- Advertisement -

వ్యవసాయ కార్మిక సంఘం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.వెంకట్రాములు విజ్ఞప్తి

మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా మహామ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రోజువారీ పనులు లేక అల్లాడుతున్న వ్యవసాయ కార్మికులకు తక్షణ సాయంగా రూ.10 వేలు అందించి ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.వెంకట్రాములు ప్రభుత్వా నికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్ కొనసాగుతున్నందున వ్యవసాయ పనులు, ఉపాధిహామి పనులు లేక కూలీలు, ఉపాధి హామీ కూలీలు, అసంఘటిత రంగ కార్మికులు, వివిధ చేతివృత్తిదారులు కోట్లాదిమంది పడుతున్న బాధలు చెప్పలేకుండా ఉన్నాయన్నారు. వీరికి మూడునెలల పాటు బియ్యంతో సహా నిత్యా వసర సరుకుల పంపిణీ చేయాలని అలాగే రేషన్‌కార్డులు లేని వారికి ఆర్థికసాయం తో పాటు నిత్యావసర వస్తువులు అందించాలని ఆయన ప్రభుత్వానికి విన్నవించారు. కరెంట్‌బిల్లులు, శానిటైజర్లు ఉచితంగా అందచేసి కరోనా వైరస్ విస్తరించకుండా చూడాలని ఆయన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

 

Ten thousand rupees give to farmers in Telangana

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News