Friday, April 26, 2024

దాదాలా ధోనీ ప్రోత్సహించలేదు: యువరాజ్ సింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తాను మెరుగైన క్రికెటర్‌గా ఎదిగేందుకు సౌరవ్ గంగూలీ అందించిన ప్రోత్సాహమే కారణమని టీమిండియా డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. కెరీర్ ఆరంభంలో అప్పటి కెప్టెన్ గంగూలీ ఎంతో ప్రోత్సాహం అందించే వాడన్నాడు. అతను అందించిన సహకారం ఎప్పటికీ మరచి పోలేనన్నాడు. తనలో దాగివున్న ప్రతిభను వెలికి తీయడంలో గంగూలీ పాత్ర కీలకమన్నాడు. క్లిష్ట సమయంలో తనకు అన్ని విధాలుగా అండగా నిలిచేవాడన్నాడు. తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపేవాడన్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో తనకు తగినన్ని అవకాశాలు దక్కలేదన్నాడు. గంగూలీతో పోల్చితే ధోనీ తనకు అండగా నిలువలేదన్నాడు. ఇక, విరాట్ కోహ్లి కూడా తనకు పెద్దగా సహకరించలేదన్నాడు. తగినన్ని అవకాశాలు కల్పించడంలో ఇటు ధోనీ, అటు కోహ్లి విఫలమయ్యారని యువరాజ్ వాపోయాడు.

Dhoni, Kohli didn’t support me like Dada: Yuvraj Singh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News