Saturday, April 27, 2024

నియోజకవర్గంలో 40 వేల శానిటైజర్‌ల పంపిణీ

- Advertisement -
- Advertisement -

sanitizers

 

హైదరాబాద్ : సిద్ధిపేట ప్రజలే నా కుటుంబం. నేను మీలో ఒకడిని. ఓట్లప్పుడే కాదు ఎప్పుడయినా, ఏ విషయంలోనైనా, మీ కష్టసుఖాల్లో మీ సేవలో ఎల్లప్పుడూ ఉంటానని మంత్రి హరీష్‌రావు నియోజకవర్గ ప్రజలకు మాట ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి హరీష్‌రావు ఆ హామీని నిజం చేశారు. బుధవారం సిద్ధిపేట పట్టణానికి దాదాపు 40వేల శానిటైజర్‌లను మంత్రి పంపించారు. మన ఆరోగ్యం, మన రక్షణ ఎక్కడో లేదు మన చేతుల్లో, మన చేతల్లో ఉండాలని, ప్రతి ఒక్కరూ చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకొని కరోనాను తరిమి కొట్టాలని శానిటైజర్ ద్వారా తన సందేశాన్ని మంత్రి హరీష్‌రావు పంపించారు. ఈ సందర్భంగా బుధవారం వార్డు కౌన్సిలర్ పట్టణంలో ఆ శానిటైజర్‌లను పంపిణీ చేశారు. తమకు ఇలాంటి నాయకుడు దొరకడం అదృష్టంగా భావిస్తున్నామని, పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. హరీష్ అన్న చెప్పినట్టు ఇంట్లోనే ఉంటాం, చేతులు పరిశుభ్రంగా ఉంచుకుంటామని ప్రజలు ఈ సందర్భంగా మంత్రికి హామినిచ్చారు.

Distribution of sanitizers in Siddipet
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News