Saturday, April 27, 2024

ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసగా మారి.. పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసగా మారిన రేయాన్ష్
చదువుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య

మనతెలంగాణ, సిటిబ్యూరోః ఆన్‌లైన్‌గేమ్‌కు బానిసగా మారిన ఓ పదో తరగతి విద్యార్థి అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… మైహోం భూజాలోని హెచ్ బ్లాక్‌లో ఉంటున్న సురేష్ కుమార్ రెడ్డి కుమారుడు రేయాన్ష్ రెడ్డి(14) స్థానికంగా ఉన్న ఓక్రిడ్జి పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. సురేష్ రెడ్డి ముంబాయిలో ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తుండగా భార్య, కుమారుడు మై హోం భూజాలో ఉంటున్నారు.

రేయాన్ష్ ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ బానిసగా మారాడు. ఈ క్రమంలోనే చదువుపై ఒత్తిడి పెరిగింది, దీనిని తట్టుకోలేక రేయాన్ష్ సోమవారం రాత్రి ఇంటి నుంచి బయటికి వచ్చాడు. కుమారుడు కన్పించకపోవడంతో తల్లి రాయదుర్గం పోలీసులకు రాత్రి 2 గంటలకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే మంగళవారం ఉదయం రేయాన్ష్ మృతదేహం అపార్ట్‌మెంట్ మూడవ గేట్ ఎంట్రన్స్‌లోని జే బ్లాక్ డక్ ఏరియాలో పడిఉంది.

జేబ్లాక్ 34వ ఫ్లోర్ నుంచి దూకి రేయాన్ష్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. వ్యక్తిగత కారణాలతోనే తాను చనిపోతున్నానని రేయాన్ష్ తల్లికి ఫోన్‌లో మెసేజ్ పంపించి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రాయదుర్గం పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News