Monday, April 29, 2024

భారత్‌లో విధ్వంసానికి ఉగ్రవాదుల ప్రయత్నాలు: నిఘా వర్గాల హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

Army headquarters

శ్రీనగర్‌ః రంజాన్ వేళ భారత్‌లోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. జమ్మూకశ్మీర్‌లోకి చొరబడేందుకు 300 మంది ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి కాచుకొని ఉన్నట్లు నిఘా వర్గాలు సమచారాన్ని అందించాయి. నౌషెరా, చాంబ్ ప్రాంతాల నుంచి చొరబడేందుకు ముష్కర మూకలు ప్రయత్నిస్తున్నాయని, పాక్ సైన్యం 16 తీవ్రవాద శిబిరాలను చైతన్యం చేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. కరోనా సోకిన తీవ్రవాదులు భారత్ లోకి చొరబడే అవకశాముందని అనుమానాలు వ్యక్తం చేశాయి.  దీంతో చొరబాటు నిరోధక బృందాలతో సైనిక ఉన్నతాధికారుల సమీక్ష నిర్వహించారు. ఉగ్రమూకల చొరబాటు యత్నాలను తిప్పికొట్టేందుకు భారత సైన్యం సిధ్ధంగా ఉందని అధికారులు పేర్కొన్నారు.

Terrorists will attempts enter into India: intelligence Alert

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News