Monday, May 6, 2024

బాల కార్మిక వ్యవస్థను శాశ్వతంగా నిర్మూలించాలి

- Advertisement -
- Advertisement -
  • హుస్నాబాద్ కోర్ట్ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కృష్ణ తేజ

హుస్నాబాద్: 14 సంవత్సరాల లోపు పిల్లలను పనికి పంపించడం నేరమని బాల కార్మిక వ్యవస్థను శాశ్వతంగా నిర్మూలించాలని హుస్నాబాద్ కోర్ట్ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కృష్ణ తేజ అన్నారు. గురువారం పట్టణంలోని సెయి ంట్ జోసెఫ్ ఉన్నత పాఠశాల్లో అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా న్యా య విజ్ఞాన సదస్సునిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుకోవల్సిన పిల్లల్ని వారి తల్లిదండ్రులు చదువు మానేసి పనికి పంపించడం చట్టరిత్యా నేరమన్నారు. పి ల్లలు 14 సంవత్సరాలు కష్టపడి చదవుకుంటే మిగతా జీవితం సంతోషంగా ఉంటారని తెలిపారు.

దేశంలో 30 శాతం బడీడు పిల్లలు బడికి వెళ్లకుండా పలు పనులు చేస్తున్నారని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదికలో తెలిపినట్లు వెల్లడించారు. ఎక్కడైనా పిల్లలు పని చేస్తే కనబడితే 1098 హెల్ప్ నంబర్ కు సమాచారం అందివ్వాలన్నారు. తక్షణమే అధికారులు వెళ్లి ఆ పిల్లలను జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి చైల్డ్ హోమ్స్‌కు తరలించి ఇంటర్మీడియట్ వరకు చదివించి తిరిగి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి అప్పజెప్పడం జరుగుతుందని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఫాదర్ విజయ్‌కుమార్‌రెడ్డి, న్యాయవాదులు చిత్తారి రవీందర్, కన్నోజు రామకృష్ణ, బాకం సంపత్‌కుమార్, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News