Monday, April 29, 2024

ప్రిక్వార్టర్స్‌లో థిమ్, హలెప్

- Advertisement -
- Advertisement -

Theme and Halep in pre quarterfinals

 

స్విటోలినా, కొర్డా ముందుకు, ఫ్రెంచ్ ఓపెన్

పారిస్ : ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో డొమినిక్ థిమ్ (ఆస్ట్రియా), సిమోనా హలెప్ (రుమేనియా) ప్రిక్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. మరోవైపు మూడో సీడ్ ఎలినా స్విటోలినా (ఉక్రెయిన్), సెబాస్టియన్ కొర్డా (అమెరికా) కూడా మూడో రౌండ్‌లో విజయం సాధించి ముందంజ వేశారు. మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ హలెప్ ఏకపక్ష విజయంతో ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో హలెప్ 60, 61 తేడాతో అమెరికాకు చెందిన 25వ సీడ్ అమందా అనిసిమోవాను చిత్తు చేసింది. ఆరంభం నుంచే చెలరేగి ఆడిన హలెప్ ఏ దశలోనూ ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. తన మార్క్ ఆటతో విజృంభించిన హలెప్ దూకుడైన ఆటతో అలవోక విజయాన్ని సొంతం చేసుకుంది. హలెప్ ధాటికి అమందా కనీస పోటీ ఇవ్వడంలో కూడా విఫలమైంది.

వరుసగా రెండు సెట్లను గెలిచిన హలెప్ నాలుగో రౌండ్‌కు దూసుకెళ్లింది. మరో పోటీలో మూడో సీడ్ స్విటోలినా జయభేరి మోగించింది. రష్యా క్రీడాకారిణి ఎకటారినాతో జరిగిన పోరులో స్విటోలినా చెమటోడ్చి నెగ్గింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో స్విటోలినా 64, 76తో విజయం సాధించింది. ఆరంభం నుంచే ఇద్దరు నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు. దీంతో పోరు ఆసక్తికరంగా సాగింది. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడు కోవడంలో సఫలమైన స్విటోలినా వరుసగా రెండు సెట్లను గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

దూకుడైన ఆటతో అలరించిన స్విటోలినా ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను సాధించింది. మరోవైపు 16వ సీడ్ ఎలిసె మార్టెన్స్‌కు మూడో రౌండ్‌లోనే చుక్కెదురైంది. ఫ్రాన్స్ క్రీడాకారిణి కరోలైన్ గార్సియాతో జరిగిన పోరులో మెర్టెన్స్ ఓటమి పాలైంది. ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో గార్సియా 16, 64, 75తో మెర్టెన్స్‌ను ఓడించింది. తొలి సెట్‌ను అలవోకగా నెగ్గిన మెర్టెన్స్ ఆ తర్వాత తీవ్ర ఒత్తిడికి గురైంది. ప్రత్యర్థి ధాటికి ఎదురు నిలువలేక వరుసగా రెండు సెట్లలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాగా, అసాధారణ ఆటతో ఆకట్టుకున్న గార్సియా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మూడో సీడ్ స్విటోలినాతో గార్సియా ప్రిక్వార్టర్స్‌లో తలపడుతుంది. మరో పోటీలో పోలండ్ క్రీడాకారిని ఇగా స్వియాటెక్ జయకేతనం ఎగుర వేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News