Saturday, April 27, 2024

లగ్జరీ కార్లను చోరీ చేస్తున్న దొంగ అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః వాలెట్ పార్కింగ్ పేరుతో లగ్జరీ కార్లను చోరీ చేస్తున్న వ్యక్తిని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు బిఎండబ్లూ కార్లను స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ డిసిపి శిల్పవల్లి తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కొత్తగూడెం జిల్లా, శ్రీనగర్ కాలనీకి చెందిన బైరెడ్డి అరుణ్ రెడ్డి అలియాస్ బంటీ వెబ్‌సైట్ డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. నిందితుడు రద్దీగా ఉంటే పార్కింగ్ ప్రాంతాల్లో ఖరీదైన కార్లలో వచ్చిన వారిని టార్గెట్‌గా చేసుకుని వాలెట్ పారింగ్ పేరుతో కారు యజమానుల వద్ద నుంచి కీస్ తీసుకుని లగ్జరీ కార్లను చోరీ చేస్తున్నారు.

కొత్త వాలెట్ పార్కింగ్ పార్కింగ్ పేజీని డమ్మీ దాన్ని సృష్టించి తన ఫోన్‌లో ఎంటర్ చేయించుకుని కార్ కీ తీసుకుని అక్కడి నుంచి పారిపోతున్నాడు. మే,2022లో గచ్చిబౌలిలోని జీరో 40 పబ్ నుంచి బిఎండబ్లూ ఎక్స్5 కారును, జూన్ 24వ తేదీన బౌల్డర్ హిల్స్‌లో నిర్వహించిన మ్యూజికల్ ఈవెంట్‌లో వాలెట్ పార్కింగ్ చేస్తానని నమ్మించి ఈవెంట్‌కు వచ్చిన మహిళ బిఎండబ్లూ జడ్4 కారును దొంతనం చేశాడు. నిందితుడు కొట్టేసిన కార్లను ఎవరూ గుర్తించని ప్రాంతంలో కొద్ది రోజులు పార్కింగ్ చేసి తర్వాత వాటి నంబర్ ప్లేట్ మార్చి వాడుకుంటున్నాడు. కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి, మాదాపూర్ సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకున్నారు. అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ జేమ్స్‌బాబు, డిఐ రవీందర్, మాదాపూర్ సిసిఎస్ టీంను డిసిపి శిల్పవల్లి అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News