Home తాజా వార్తలు భాగ్యనగరంలో దొంగల బీభత్సం…

భాగ్యనగరంలో దొంగల బీభత్సం…

Thief theft in hyderabad

 

హైదరాబాద్: కుల్సుంపురా ప్రాంతం జియాగూడలోని వెంకటేశ్వరనగర్ కాలనీలో దొంగతనం జరిగింది. దుండగులు ఐదు ఇండ్లలో దొంగతనం చేశారు. 20 లక్షల రూపాయల నగదు, 45 తులాల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు. దొంగల బీభత్సానికి కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు.