Home జాతీయ వార్తలు ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి

Jharkhand-encounter

రాంచి: జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భమ్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతాబలగాలకు వావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు వావోయిస్టులు మృతి చెందారు. నక్సలైట్లు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతాబలగాలు, స్థానిక పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగానే నక్సలైట్లకు, భద్రతా బలగాలకు నడుమ గురువారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు చనిపోగా.. ఒకరు గాయపడ్డారని ఐజి సాకేత్ కుమార్ సింగ్ తెలిపారు. ఘటనాస్థలిలో ఎకే-47 లతో పాటు పెద్ద సంఖ్యలో ఆయుధాయలను స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు.

Three Naxals killed in Jharkhand Encounter