Saturday, April 27, 2024

బెజ్జూరు అడవిలో పులి హల్‌చల్

- Advertisement -
- Advertisement -

Tiger hulchal in Bejjur forest

బెజ్జూరుః కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా బెజ్జూరు అడవిలో పులి హల్‌చల్ చేయడంతో గిరిజన గ్రామాల ప్రజలు బంబేలు పేడుతున్నారు. పెంచికల్‌పేట్ మండలంలోని కోండపల్లి గ్రామానికి చెందిన మడావి మధుకర్, కుమ్రం పోచయ్యలు బెజ్జూరు నుండి గుండెపల్లి వెళ్తున్న మార్గమద్యలో పులి ఒకేసారి గాండ్రించడంతో భయంతో ఒకేసారి ద్వీచక్రవాహానం నుండి కిందపడిపోయి స్రృహాతప్పి పడిపోయారు. దానితో వారి వద్దకు పులి వచ్చి వారి చూట్టురు తిరిగి వారి వద్దకు వచ్చి వాసనచూసి వెళ్లిపోయినట్లు బాదితులు తెలిపారు. దీంతో బాధితులు వెంటనే లేచి ద్విచక్రవాహానంతో వేగంగా వెళ్లిపోయారు. ఈ విషయం మరికోంత మంది ద్విచక్రవాహానాలతో వస్తున్న వారికి కూడా పులి కనిపించడంతో వారు కేకలు వేశారు. దీంతో పులి పారిపోయింది.

కింద పడిపోయిన ఇద్దరు వ్యక్తులను వారు లేపి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో ప్రతి నిత్యం వందలాదిగా బెజ్జూరు మండలానికి కమ్మర్‌గాం, గుండేపల్లి, తదితర గ్రామాల ప్రజలు వివిధ పనుల కోసం వస్తుంటారు. ఈ విషయం పలు గ్రామాల ప్రజలకు తెలియడంతో ప్రజలందరు భయభ్రంతులకు గురి అవుతున్నారు. అంతేకాకుండ పులి మరోసారి మానికదేవర ప్రాంతంలోని ప్రధాన రహాదారిపై వెల్లడంతో పలువురు చూసి పరుగులు తీసినట్లు పలు గ్రామాల గిరిజన ప్రజలు తెలుపుతున్నారు. ఈ విషయమై బెజ్జూరు ఎఫ్‌అర్‌ఓ దయాకర్‌కు స్థానికులు తెలుపడంతో వివరాలు ఎఫ్‌అర్‌ఓ అడిగి తెలుసుకోగా ద్విచక్రవాహానం నుండి పులిని చూసి పడిపోవడంతో తమకు కాళ్లకు, చేతులకు గాయాలు అయినట్లు బాదితులు వారికి తెలుపడంతో వారికి మేరుగైన వైద్య సేవల కొసం సిర్పూర్ అసుపత్రికి తరళించారు. కావున మండలంలోని ప్రజలు పశువుల కాపరులు పులి సంచారం ఉన్నందున అడవి ప్రాంతంకు వెల్లవద్దని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News