Saturday, April 27, 2024

మాజీ సిజెఐ రంజన్ గొగొయ్‌పై హక్కుల తీర్మానం

- Advertisement -
- Advertisement -
TMC MP Moves Privilege Motion Against Former CJI
దాఖలుచేసిన టిఎంసి ఎంపీ

న్యూఢిల్లీ: మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి(సిజెఐ) ఇటీవల ఎన్‌డిటివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యానాలపై రాజ్యసభ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మౌసం నూర్ ఆయనకు వ్యతిరేకంగా హక్కుల తీర్మానం దాఖలు చేశారు. వివిధ పార్టీలకు చెందిన మరో 10 మంది ఎంపీలు కూడా ఇదేరీతిలో సభాహక్కుల తీర్మానాన్ని దాఖలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. డిసెంబర్ 9న ప్రసారమైన ఇంటర్వూలో ‘పార్లమెంటులో మీ హాజరు అంత తక్కువగా ఎందుకు ఉంది?’ అని ప్రశ్నించినప్పుడు, మాజీ సిజెఐ రంజన్ గొగొయ్ ‘కొవిడ్ ఆంక్షలు, సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం,సీటింగ్ ఏర్పాటు తనకు ఇబ్బందికరంగా ఉన్నాయని’ అన్నారు. ‘నాకు ముఖ్య విషయంపై మాట్లాడాలని తోచినప్పుడు నేను రాజ్యసభకు వెళతాను. నేను నామినేటెడ్ సభ్యుడిని. ఏ పార్టీ విప్ నాపై అధికారం చెలాయించజాలదు’ అన్నారు మాజీ ప్రధాన న్యాయమూర్తి రిటైర్ అయిన నాలుగు నెలలకే రాజ్యసభ సభ్యుడిగా చేరడంపై అడిగిన ప్రశ్నకు ఆయన ‘ఈ రాజ్యసభలో పెద్ద అద్భుతం ఏముంది? ఒకవేళ నేను ఏ ట్రిబ్యునల్‌కో చైర్మన్ అన్న అయి ఉంటే ఇంతకన్నా మంచి జీతభత్యాలు పొంది ఉండేవాడిని’ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News