Monday, April 29, 2024

హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం ముందు టిఎంసి ఎంపీల నిరసన

- Advertisement -
- Advertisement -

TMC MPs protest

న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సోమవారం ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో ఉన్న హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శించారు. త్రిపురలో తమ పార్టీ కార్యకర్తలపై జరిగిన హింసాకాండ గురించి చర్చించేందుకు వారు హోం మంత్రి అపాయింట్‌మెంట్ కోరగా వారికి అది లభించలేదు. దాంతో వారు నిరసనకు దిగారు. పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ సైతం సోమవారం సాయంత్రంకల్లా ఢిల్లీ చేరుకుంటారని సమాచారం. బిజెపి దాడులు రెచ్చగొడుతుంటే, అధికార పక్షానికి చెందిన నిందితులకు రాష్ట్ర పోలీసులు రక్షణ ఇస్తున్నారని వారు ఆరోపించారు. త్రిపురలో టిఎంసికి ఇంచార్జీ, నాయకురాలు అయిన సుస్మితా దేవ్ ట్వీట్ కూడా చేశారు. త్రిపురలో శాంతిభద్రతల పరిస్థితి, రాజకీయ హింసాకాండ, ర్యాలీ నిర్వహణకు పోలీసుల అనుమతి నిరాకరణ వంటి వాటి గురించి ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు. త్రిపురలో నవంబర్ 25న పౌర ఎన్నికలు జరుగనున్నాయి. త్రిపుర పోలీసులు ఆదివారం టిఎంసి లీడర్ , నటి సయోని ఘోష్‌ను హిట్ అండ్ రన్ కేసులో అరెస్టు చేశారు. ఆమెను హత్యాయత్నం, ఇతర ఐపిసి సెక్షన్ల కింద అరెస్టు చేశారు. కాగా టిఎంసి మాత్రం ఆమె త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ దేబ్‌కు వ్యతిరేకంగా బహిరంగ సభలో నినాదాలు చేసినందుకు అరెస్టు చేశారని పేర్కొంటున్నారు. త్రిపురలోని వివిధ ప్రదేశాల్లో పద్ధతి ప్రకారం జరిగిన దాడులలో అనేక మందితోపాటు కొందరు జర్నలిస్టులు కూడా గాయపడ్డారు. నవంబర్ 25న అగర్తలా మున్సిపల్ కార్పొరేషన్(ఎఎంసి), 12 ఇతర మున్సిపల్ సంస్థల ఎన్నికల ఉద్రిక్తతల కారణంగానే ఈ దాడులు జరుగుతున్నాయని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News