Wednesday, May 1, 2024

‘సత్యం భయపడదు’

- Advertisement -
- Advertisement -

Toolkit Case: "Truth is not afraid" Rahul Gandhi tweeted

టూల్‌కిట్ కేసులో రాహుల్‌గాంధీ ట్విట్

న్యూఢిల్లీ: కొవిడ్ టూల్‌కిట్ వ్యవహారంలో ఢిల్లీ పోలీసుల తీరును తప్పు పడ్తూ ‘సత్యం భయపడదు’ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ట్విట్ చేశారు. టూల్‌కిట్ అంశంలో ఢిల్లీ పోలీసులు ట్విట్టర్ ఇండియాకు నోటీస్ జారీ చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఢిల్లీ పోలీసులు ఢిల్లీ, గురుగ్రాంలోని ట్విట్టర్ ఆఫీసులకు వెళ్లారు. తమకు అందిన ఫిర్యాదుతో దర్యాప్తులో భాగంగా ట్విట్టర్ ఆఫీసులకు వెళ్లామని పోలీసులు అంటున్నారు. అయితే, అది పిరికితనంతో చేసిన దాడిగా రాహుల్ విమర్శించారు. బిజెపి నేతలు మోసపూరిత టూల్‌కిట్‌ను సృష్టించగా, దానిని మరుగుపరిచేందుకే ఢిల్లీ పోలీసులు కుంటిసాకులు చెబుతున్నారని రాహుల్ ట్విట్ చేశారు. బిజెపి అధికార ప్రతినిధి సంబిత్‌పాత్ర చేసిన ట్విట్‌ను వక్రీకరణగా ట్విట్టర్ అభివర్ణించింది. మీడియాను తనకు అనుకూలంగా మలిచే చర్యగా ట్విట్టర్ లేబుల్ వేసింది. దీనిపై బిజెపి నేతలు మండిపడుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News