Friday, May 3, 2024

నాదల్‌కు కఠిన పరీక్ష

- Advertisement -
- Advertisement -

Tough test to Nadal in the ATP Tour Finals

 

లండన్: ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, స్పెయిన్ దిగ్గజం, రెండో సీడ్ రఫెల్ నాదల్‌కు త్వరలో జరిగే ఎటిపి టూర్ ఫైనల్స్‌లో కఠిన పరీక్ష తప్పెలా లేదు. ఇప్పటి వరకు ఎటిపి టూర్ ఫైనల్స్‌లో అంతంత మాత్రంగానే రాణించిన నాదల్‌కు ఈసారి కూడా టైటిల్ క్లిష్టంగానే కనిపిస్తోంది. ప్రపంచ టెన్నిస్‌లోని 8 మంది అగ్రశ్రేణి క్రీడాకారుల మధ్య ఎటిపి టూర్ ఫైనల్స్ జరగడం అనవాయితీగా వస్తోంది. ఇందులో పాల్గొనే ఆటగాళ్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూప్‌లో టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా), నాలుగో సీడ్ మెద్వెదేవ్ (రష్యా), ఐదో సీడ్ అలెగ్జాండర్ జ్వరేవ్ (జర్మనీ), 8వ సీడ్ డీగో షావర్ట్‌మాన్ (అర్జెంటీనా) ఉన్నారు. ఇక నాదల్ గ్రూప్‌లో మూడో సీడ్ డొమినిక్ థిమ్ (ఆస్ట్రియా), ఆరో సీడ్ సిట్సిపాస్ (గ్రీక్), ఏడో సీడ్ ఆండ్రీ రుబ్లేవ్ (రష్యా) ఉన్నారు. గ్రూప్ దశలో నాదల్ తొలి మ్యాచ్‌ను రుబ్లేవ్‌తో తలపడనున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News