Friday, April 26, 2024

సికింద్రాబాద్ రైల్వే ఆస్పత్రిలో కరోనా రోగులకు చికిత్స

- Advertisement -
- Advertisement -

Treatment to Corona Patients at Secunderabad Railway Hospital

 

29 నుంచి అధికారికంగా ప్రారంభం
కేవలం రైల్వే ఉద్యోగులకు మాత్రమే చికిత్సలు
9 మంది స్పెషలిస్టు వైద్యులు, 34 జిడిఎంఓలు, 77 మంది నర్సింగ్ సూపరింటెండెంట్లు,
ఏడుగురు ల్యాబ్ అసిస్టెంట్లు, 77 హాస్పిటల్ అటెండెంట్ల నియామకం పూర్తి

మనతెలంగాణ/హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే ఆస్పత్రిలోనూ కరోనా రోగులకు చికిత్స అందించనున్నారు. అయితే ఈ చికిత్సలు కేవలం ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకే పరిమితం కానున్నాయి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే అనుమతులు లభించాయి. త్వరలో దీనిని దక్షిణ మధ్య రైల్వే అధికారికంగా ప్రకటించనున్నట్టుగా తెలిసింది. లాలాగూడలోని రైల్వే ఆస్పత్రిలో ఐసొలేషన్ పడకల ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ ఆస్పత్రిలో 400కు పైగా పడకలు ఉండగా 100 నుంచి 140 పడకలతో ‘కొవిడ్-19 బ్లాక్’ను ఏర్పాటు చేశారు. దీనికోసం తాత్కాలిక ప్రాతిపదికన వైద్యులు, నర్సులు, పారామెడికల్, టెక్నికల్ సిబ్బందిని నియమిస్తున్నారు.

9 మంది స్పెషలిస్టు వైద్యులు, 34 జిడిఎంఓలు, 77 మంది నర్సింగ్ సూపరింటెండెంట్లు, ఏడుగురు ల్యాబ్ అసిస్టెంట్లు, 77 హాస్పిటల్ అటెండెంట్ల నియామకం కోసం ఏప్రిల్‌లో నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రస్తుతం ఎంపికైన తాత్కాలిక వైద్యులు, సిబ్బందికి ఇండియన్ రైల్వే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ కమ్యూనికేషన్స్ (ఇరిసెట్)లో శిక్షణ ఇస్తోంది. సోమవారం(జూన్ 29) నుంచి చికిత్సలు ప్రారంభించే యోచనలో రైల్వే శాఖ ఉంది. రైల్వేలోనూ క్రమక్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 15 మంది రైల్వే సెక్యూరిటీ గార్డులు, ఇతర సిబ్బందికి కరోనా సోకింది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే ఆస్పత్రిలోనూ వీరికి సేవలందించేలా రైల్వే శాఖ చర్యలు చేపట్టింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News