Monday, April 29, 2024

నిరుద్యోగులకు ఉచిత ఆన్‌లైన్ శిక్షణ తరగతులు

- Advertisement -
- Advertisement -

Free online training classes for Unemployed

 

మన తెలంగాణ, హైదరాబాద్ :  జిల్లాలో నిరుద్యోగ యువకుల కోసం ఎంఎన్‌సీ కంపెనీల ఆధ్వర్యంలో ఉచిత ఆన్‌లైన్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు యుఈఐ, జీబి డిప్యూటీ చీప్ అధికారి టి. రాము తెలిపారు. శనివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ అభ్యర్దులు బిఎస్సీ, బికాం,బిబిఎం చదివి 2018,2109,2020 సంవత్సరంలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులన్నారు. ప్రతి రోజు 2గంటలకు ఆన్‌లైన్ ద్వారా మొత్తం 80 గంటలు ఉచిత ట్రైనింగ్ ఉంటుందన్నారు.

దాదాపు 40రోజుల వరకు ఈప్రీ ఆన్‌లైన్ ట్రైనింగ్ ఉంటుందని, విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసిన అభ్యర్దులకు సర్టిఫికెట్‌తో పాటుగా ఉద్యోగ అవకాశాలు కల్పించనట్లు చెప్పారు. ఎస్సీ,ఎస్టీలో పాటు మహిళా అభ్యర్దులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు. వయస్సు 28 సంవత్సరాల లోపు గల అభ్యర్దులు మాత్రమే దరఖాస్తుచేసుకోవాలని సూచించారు.ఆన్‌లైన్ ట్రైనింగ్ వివరాలు ఇంగ్లీషు కమ్యూనికేషన్, గ్రామర్, వాకుబులరీ, ఈమెయిల్ ఈటీక్యూట్, సాప్ట్ స్కిల్స్, రెసుమ్ బిల్డింగ్, ఇంటర్వూ పేసింగ్ స్కిల్స్ మొదలైన అంశాలపై ఉచిత ఆన్‌లైన్ శిక్షణ ఉంటుందని వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News