Monday, April 29, 2024

అమీర్‌పేట తహసీల్దార్‌ కు కరోనా

- Advertisement -
- Advertisement -

Corona Positive to Ameerpet Tahsildar

 

రెవెన్యూశాఖలో వైరస్ కలకలం
కార్యాలయాన్ని శానిటైజర్ చేసిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది
హోం క్వారంటైన్‌కు వెళ్లిన సహోద్యోగులు
ఆమె కలిసిన వారిని గుర్తించే పనిలో పడ్డ వైద్యబృందాలు

మన తెలంగాణ, హైదరాబాద్ : నగరంలో కరోనా భూతం కరాళనృత్యం చేస్తూ ప్రభుత్వ అధికారులను భయాందోళనకు గురిచేస్తుంది. ఇప్పటివరకు వైద్యులు, పోలీసు, జర్నలిస్టులను అతలాకుతలం చేసిన మహమ్మారి తాజాగా రెవెన్యూశాఖకు పాకడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఎంతమందికి సోకుతుందని భయపడుతూ విధులకు దూరంగా ఉండేందుకు సిద్దమైతున్నారు. శనివారం అమీర్‌పేట తహసీల్దార్కు పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో కార్యాలయాన్ని బల్దియా సిబ్బంది శానిటైజర్ చేశారు. మిగతా సిబ్బందిని అధికారులు టెస్టులు నిర్వహించారు. ఆమెను స్దానిక రాజకీయ నాయకులు, సొంతం పని కోసం సాధారణ ప్రజలు కలిసినట్లు సిబ్బంది చెబుతున్నారు. వైద్యశాఖ అధికారులు తహసీల్దారు కలిసి వారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.ఇప్పటికే ఆమె కలిసివారిలో కొంతమంది వైద్యపరీక్షలు చేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు.

ఇటీవల అదే ప్రాంతానికి చెందిన కార్పొరేటర్‌కు సోకడంతో ఈసారి చాలామందికి వైరస్ సోకే ప్రమాదమున్నట్లు వైద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. నగరంలో ఇప్పటికే జీహెచ్‌ఎంసీలో వైరస్‌కు గురైతున్న అధికారుల సంఖ్య పెరుగుతుంది. జోనల్, ప్రధాన కార్యాలయం తేడా లేకుండా కరోనా కబలిస్తుంది. అదే విధంగా రెండు కితం గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బందికి సోకింది. వారి ద్వారా కుటుంబసభ్యులు కూడా వైరస్ బారినపడ్డారు. దీంతో రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, వైద్యశాఖ, పోలీసుశాఖలో విధులు నిర్వహిస్తున్న పలువురు సిబ్బంది సెలువులు పెట్టుకునేందుకు సిద్దమైతున్నారు.

వైరస్ బారిన పడితే అంతే సంగతులు తమ కుటుంబ భవిష్యత్తు ఏమిటన్ని ఉన్నతాధికారులను నిలదీస్తూ ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఇంటి వద్ద ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తోటి ఉద్యోగులు వెల్లడిస్తున్నారు. ప్రభుత్వం కరోనా రోగులకు సేవలందించే సిబ్బందిని పెంచి వారికి పిపిఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్ సరిపడ పంపిణీ చేయాలని, ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు అదనపు పనిగంటలు చేస్తూ అనారోగ్యానికి గురైతున్నారని, ఏమాత్రం కరోనా లక్షణాలు వారిలో కనిపించిన తట్టుకోలేక పోతున్నట్లు వైద్యసిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News