Friday, April 26, 2024

ఆదిలాబాద్ లో టిఆర్ఎస్ అభ్యర్థి దండే విఠల్ విజయం

- Advertisement -
- Advertisement -

TRS candidate Dande Vithal wins in Adilabad

హైదరాబాద్: ఆదిలాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో టిఆర్ఎస్ విజయం సాధించింది. ఆదిలాబాద్ లో 667 ఓట్ల మెజార్టీతో టిఆర్ఎస్ అభ్యర్థి దండే విఠల్ గెలుపొందారు. దండే విఠ‌ల్ 742 ఓట్ల‌తో విజ‌యం సాధించారు. ఆదిలాబాద్ లో మొత్తం ఓట్లు 860. అందులో చెల్లిన ఓట్లు 810, చెల్లని ఓట్లు 45 ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థి పెందూరి పుష్పరాణి 75 ఓట్ల‌కే ప‌రిమిత‌మయ్యారు. స్థానిక సంస్థల ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో టిఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ కు తిరుగులేని ఆద‌ర‌ణ‌ ఉందని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. ఎన్నిక‌లు ఏవైనా టిఆర్ఎస్ దే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్ర‌జాప్ర‌తినిదులు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ ద‌న్య‌వాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News