Saturday, April 27, 2024

దుకాణం మూసుకోవడమే ‘ఉత్తమం’

- Advertisement -
- Advertisement -

పిసిసి అధ్యక్షుడికి మంత్రి కెటిఆర్ సలహా

ఓటర్లను కాంగ్రెస్, బిజెపిలు అవమానపరుస్తున్నాయి
ఉత్తమ్‌కు వ్యవస్థలపైన, ప్రజలకు కాంగ్రెస్ పైన నమ్మకం లేదు
వార్డు సభ్యులు, కార్పొరేటర్లు
సిఎం కెసిఆర్‌లా పనిచేయాలి
నిధుల కొరత లేదు, విధులు నిర్వహించాలి, పని చేయకపోయినా, అక్రమాలకు పాల్పడినా పదవుల
నుంచి తొలగిస్తాం
తెలంగాణ భవన్‌లో తనను కలుసుకుని అభినందించిన విజేతలతో కెటిఆర్

KTR

సామాజిక న్యాయమే టిఆర్‌ఎస్ విధానం

టిఆర్‌ఎస్ పార్టీ, ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాయి. మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు పాటించాం. చైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ పదవుల్లో మహిళలకు 57 శాతం కల్పించాం. బిసిల్లోని అణగారిన వర్గాలకు కూడా పదవులు ఇచ్చాం. బిసిలకు 58 శాతం పదవులు లభించాయి.

మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యాంగవ్యవస్థలపై నమ్మకంలేని ఉత్తమ్ ఇక నీ దు కాణం మూసుకోవడమే ఉత్తమమని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపాలిటీ, ఐటి,పరిశ్రమల శాఖ మ ంత్రి కల్వకుంట్ల తారక రామారావు హెచ్చరించారు. తెల ంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం జరిగిన అన్ని ఎ న్నికల్లో ఉత్తమ్ ఇక మూసుకుని ఇంట్లో కూర్చోమని ప్ర జలు తీర్పు ఇచ్చినప్పటికీ ఆయన ఇంట్లో కూర్చోక వ్యవస్థలపై ఆరోపణలు చేస్తున్నారని కెటిఆర్ దుయ్యబట్టారు. ఎన్నికలు ఏవైనా తెలంగాణలో సిఎం కెసిఆర్ పక్షాన ప్రజ లు అద్భుత దృశ్యాలను ఆవిష్కృతం చేస్తున్నారని కెటిఆర్ చెప్పారు. గురువారం టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచిన ఛైర్మన్లు, వార్డు సభ్యులు, పలువురు శాసనసభ్యులు కెటిఆర్‌ను కలిసి అభినందించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ ఉత్తమ్‌కు వ్యవస్థలపై నమ్మకం లేదు, ప్రజలకు కాంగ్రెస్‌పై నమ్మకంలేదన్నారు. కాంగ్రెస్‌లోని ఢిల్లీనాయకులపై, రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులపై తెలంగాణ ప్రజలకు నమ్మ కం లేదనే విషయం అనేక ఎన్నికల్లో స్పష్టం అయ్యిందన్నారు. ప్రజలు ఊహించని విధంగా శత్రువుల్లా ఉండే ప్రతిపక్షాలు ఒక్కటైనా ప్రజాభలం ఉన్న టిఆర్‌ఎస్ ప్రభంజనం ముందు నిలవలేక పోయారని ఆయన చెప్పారు. డిసెంబర్‌లో జ రిగిన శాసనసభ ఎన్నికల్లో బద్దశత్రువులైన రాహు ల్ గాంధీ, చంద్రబాబు నాయుడు ఒక్కటై కాలికి బలపం కట్టుకుని తిరిగినా టిఆర్‌ఎస్ ముందు నిలవలేక పోయారన్నారు. ముఖ్యమంత్రి, టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ మానాయకుడని 199 నియోజకవర్గాల్లో 75 శాతం సీట్లు టిఆర్‌ఎస్‌కు ప్రజలు ఇచ్చి ఆశీర్వదించారని తెలిపారు. సిఎం కెసిఆర్ రాష్ట్రానికి శ్రీరామ రక్షని ప్రతి ఎన్నికల్లో ప్రజలు తీర్పునిచ్చారని ఆయన గుర్తు చేశారు.
ప్రజలను కాంగ్రెస్, బిజెపి అవమానిస్తోంది
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి ప్రజల మద్దతుతో వరుసవిజయాలు సాధిస్తున్నా టిఆర్‌ఎస్ ఏనాడు విర్రవీగలేదని కెటిఆర్ చెప్పారు. చట్టం కల్పించిన హక్కులమేరకే మున్సిపాలిటీ,కార్పొరేషన్ ఎన్నికల్లో సంపూర్ణ విజయం సాధించామని ఆయన చెప్పారు. 120 మున్సిపాలిటీల్లో 8 మినహా అన్నింటిని టిఆర్‌ఎస్ గెలుచుకుంది. అలాగే 10 కార్పొరేషన్లపై గులాబిజెండా ఎగరవేశామని గుర్తుచేశారు. అన్నికల ప్రక్రియపూర్తిఅయిన తర్వాత వ్యవస్థలమీద నమ్మకం లేకుండా కాంగ్రెస్ ఉత్తమ్,బిజెపి లక్ష్మణ్‌మాట్లడుతున్నారని ఆయన ఆరోపించారు.
ప్రతినాయకుడు సిఎం కెసిఆర్‌లా పనిచేయాలి
గెలవడంతోనే పూర్తి కాలేదు, మనకంటే ముందు గెలిచారు, మనం గెలిచాము, మనతర్వాత కూడా గెలుస్తారు. అయితే గెలిచిన వారు ప్రజల్లో స్థిరస్థాయిగా ఉండే విధంగా పనులుచేసి గుర్తింపు పొందాలని కెటిఆర్ చెప్పారు. ఏ నమ్మకంతో ప్రజలు టిఆర్‌ఎస్‌ను గెలిపిస్తున్నారో ఆ నమ్మకం మేరకు పనిచేసి చరిత్రలో మిగలాలన్నారు. గెలవగానే అహంకారం పనికి రాదు. నేలవిడిచి సాము చేయవద్దని కెటిఆర్ హితవు చెప్పారు. నూతన మున్సిపాలిటీ చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహనతో ఉండలని కెటిఆర్ ఆదేశించారు.
నిధులకు కొరత లేదు, విధులు నిర్వహించాలి
మున్సిపాలిటీలకు ప్రతినెల నిధులు టెన్షన్‌గా ప్ర భుత్వం విడుదల చేస్తోంది. అయితే నిర్ధేషిత విధు లు నిర్వహించని పక్షంలో నూతన మున్సిపాలిటీ చట్టం మేరకు పదవుల్లోనుంచి తొలగించే ప్రమా దం ఉందని కెటిఆర్ హెచ్చరించారు. ప్రణాళిక బద్దమైన అభివృద్ధి, పారదర్శకమైన సేవలు అలవర్చుకోవాలని చెప్పారు. త్వరలోనే మున్సిపాలిటీ చట్టంపై శిక్షణ తరగతులుంటాయని కెటిఆర్ చెప్పారు. కేంద్ర ఆర్థిక కమిషన్ సిఫార్సు మే రకు ప్రతినెల మున్సిపాలిటీలకు రూ.2,074 కో ట్లను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. అలాగే ము న్సిపాలిటీలకు ఉన్న అర్థిక లావాదేవీల్లో వచ్చే ని ధులనుకూడా పెంచేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. పేదలకు ఆర్థిక భారం పడకుండా పన్నులు పెంచే అవకాశాలున్నాయని చెప్పారు.
సామాజిక న్యాయం టిఆర్‌ఎస్ విధానం
‘టిఆర్‌ఎస్ పార్టీ, ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని కెటిఆర్ చెప్పారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో మహిళలకు 50% ఉ న్న రిజర్వేషన్లు పాటించడంతో పాటు చైర్మన్, డి ప్యూటీ ఛైర్మన్ పదవుల్లో మహిళలకు 57% కల్పిం చి టిఆర్‌ఎస్ సామాజిక న్యాయంలో ఆదర్శంగా నిలిచిందని కెటిఆర్ చెప్పారు. బిసిల్లోని అణగారినవర్గాలకు కూడా పదవులు ఇవ్వడంతో 58 %బిసిలకు పదవులు లభించాయని చెప్పారు’.
కెటిఆర్‌కు వెల్లువెత్తిన అభినందనలు
మున్సిపాలిటీ,కార్పొరేషన్లలో సంపూర్ణ విజయం సమకూర్చిన టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్‌ను పలువురు ప్రజాప్రతినిధులు అభినందించారు. ఇందులో మంత్రి గంగుల కమలాకర్, శాసనసభ్యులు పెద్ది సుదర్శన్‌రెడ్డి, పద్మాదేవేందర్ రెడ్డి, రసమయి బాలకిషన్, మర్రిజనార్థన్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, బస్వరాజు సారయ్య, రెడ్యానాయక్, ఎంపి మాలోత్ కవిత, హైదరాబాద్ నగర మేయర్ రామ్మోహన్ ఉన్నారు. అలా గే మరిపెడ, డోర్నకల్, రామాయంపేట్, మెదక్, చౌటుప్పల్, కామారెడ్డి, కొల్లాపూర్, నర్సంపేట, హుస్నాబాద్, నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీల ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు కెటిఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News