Home తాజా వార్తలు సిఎం కెసిఆర్ తో టిఆర్ఎస్ ఎంపిల భేటీ…

సిఎం కెసిఆర్ తో టిఆర్ఎస్ ఎంపిల భేటీ…

TRS MPs meet with CM KCR

 

ఢిల్లీ: మూడు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ చేరుకున్న తెలంగాణ సిఎం కెసిఆర్ ను టిఆర్ఎస్ లోకసభ పక్షనేత , ఖమ్మం ఎంపి నామ నాగేశ్వరరావు నేతృత్వంలో ఎంపిలు శనివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఢిల్లీలోని సిఎం నివాసంలో కెసిఆర్ ను ఎంపిలు నామ నాగేశ్వరరావు , కేఆర్ సురేష్ రెడ్డి , కొత్త ప్రభాకర్ రెడ్డి , బీబీ పాటిల్ , బి . వెంకటేశ్ నేత కలిశారు. సిఎం తో టీఆర్ఎస్ ఎంపిలు మర్యాదపూర్వకంగా భేటీ అయి పలు అంశాలపై చర్చించారు.