Saturday, April 27, 2024

జూన్‌లో బడులు ప్రారంభమయ్యేనా?

- Advertisement -
- Advertisement -

 మే 27 నుంచి జూన్ 13 వరకు వేసవి సెలవులు
 ఆ తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణయం

TS Academic Calendar 2021 to begin from June

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త విద్యాసంవత్సరం జూన్ నాటికి ప్రారంభమవుతుందా లేదా అనే విషయంపై సందేహాలు తలెత్తుతున్నాయి. పలు రాష్ట్రాల్లో మళ్లీ కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొవిడ్ కేసులు పెరుగుతుండడం తో మహారాష్ట్ర, పూణెలోని కొన్ని ప్రాంతాలలో వారం రోజుల పాటు రాత్రి కర్ఫూ విధిస్తూ అక్కడి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. కొవిడ్ కేసుల పరిస్థితి బట్టే జూన్‌లో పాఠశాలల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో జనవరి 31 వరకు ఆన్‌లైన్ తరగతులే కొనసాగగా, ఫిబ్రవరి 1 నుంచి 9,10 తరగతులు, ఆపై తరగతుల విద్యార్థులకు ప్రత్యక్ష బోధన ప్రారంభమైంది. ఈ విద్యాసంవత్సరం మే 26 చివరి పనిదినంగా నిర్ణయించారు. మే 27వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. అయితే, జూన్ 14 తర్వాత కొవిడ్ కేసులను బట్టి విద్యాసంవత్సరం ప్రారంభంపై నిర్ణ యం తీసుకోనున్నారు. ఒకవేళ జూన్‌లో విద్యాసంవత్సరం ప్రారంభమైనా అన్ని తరగతులకు ప్రత్యక్ష బోధ న ప్రారంభిస్తారా..? లేక కొన్ని తరగతులకే ప్రారంభిస్తారా..? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. మార్చిలోగా ఫార్మేటివ్ అసెస్‌మెంట్(ఎఫ్‌ఎ)-1 పరీక్షలు జరుగనుండగా, ఏప్రిల్ 15లోగా ఫార్మేటివ్ అసెస్‌మెంట్(ఎఫ్‌ఎ) జరుగనుండగా, మే 17 నుంచి 26 వరకు పద వ తరగతి పరీక్షలు జరుగనున్నాయి. పాఠశాలల్లో 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభమైనప్పటికీ, 6,7,8 తరగుతుల భౌతిక తరగతుల నిర్వహణపై ఇం కా ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ తరగతులకు ఈ ఏడాది ప్రత్యక్ష బోధన వద్దనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. కొవిడ్ నిబంధనలతో భౌతికదూరం పాటి స్తూ 6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభిస్తే తరగతి గదులు కొరత ఏర్పడవచ్చనే అధికారులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.ఈ సారి అందరినీ ప్రమోట్ చేసి వచ్చే విద్యాసంవత్సరమే తరగతులు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది.
ప్రైమరీ తరగతులకు మరింత ఆలస్యం..?
వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంలో ఉన్నత, ప్రాథమికోన్నత తరగతులకే అనుమతిచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రైమరీ, ప్రీప్రైమరీ తరగతుల విద్యార్థులకు మాత్రం కొంతకాలం వేచి చూసి పరిస్థితులను ప్రత్యక్ష బోధనకు అనుమతివ్వనున్నట్లు సమాచారం. ఈసారి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకున్న ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ప్రత్యక్ష బోధన చేపట్టకుం డా, ఆన్‌లైన్ విద్యా బోధనే కొనసాగించి పైతరగతులకు ప్రమోట్ చేసేందుకు చర్యలు చేపడుండగా, వచ్చే విద్యాసంవత్సరం కూడా ఒకటి రెండు నెలల తర్వాతనే ప్రత్యక్ష బోధనకు అనుమతివ్వనున్నట్లు సమాచారం. విద్యార్థుల వయసు, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రీప్రైమరీ, ప్రైమరీ తరగతుల విద్యార్థులకు భౌతిక తరగతులపై నిర్ణయం తీసుకోనున్నారు.

TS Academic Calendar 2021 to begin from June

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News