Monday, April 29, 2024

15 నుంచి అసెంబ్లీ సమావేశాలు?

- Advertisement -
- Advertisement -

18న బడ్జెట్ ప్రవేశపెట్టే సూచన
12 నుంచి 15 రోజుల పాటు సమావేశాలు
ఒకటి, రెండు రోజుల్లో ముఖ్యమంతి కెసిఆర్ తుది నిర్ణయం

మన తెలంగాణ/హైదరాబాద్: ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. సమావేశాల నిర్వహణ తేదీలపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక రెండు రోజుల్లోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరాని (2021…20-22)కి సంబంధించిన ద్రవ్య వినిమయ బిల్లును మార్చి 31లోగా ఉభయ సభలు తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉండడంతో ఈసారి బడ్జెట్ సమావేశాలు 12- నుంచి 15 రోజులకు మించి జరిగే అవకాశాలు లేవని తెలుస్తోంది. కరోనా కేసులు మళ్లీ పుంజుకుంటుండటం కూడా మరో కారణమని తెలుస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభధ్రుల ఎంఎల్‌సి స్థానంతో పాటు వరంగల్, -ఖ మ్మం, -నల్లగొండ పట్టభద్రుల ఎంఎల్‌సి స్థానానికి కూడా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఉమ్మడి ఆరు జిల్లాల్లో కలిపి సుమారు 77 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతుండడంతో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, పోల్ మేనేజ్‌మెంట్ ఏర్పాట్లలో మంత్రులు, ఎంపిలు, స్థానిక శాసనసభ్యులు, ఎంఎల్‌సిలు బిజీగా ఉన్నారు. రెండు స్థానాలకు ఈ నెల 14న పోలింగ్ జరగనుండగా 17న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. అప్పటి వరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అములలో ఉంటుంది. ఎన్నికల ముగిసిన వెంటనే అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలంటే ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి ముందస్తూ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేసి అసెంబ్లీ సమావేశాలను 15 నుంచి నిర్వహించడానికే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లుగా తెలుస్తోంది. అదే రోజున గవర్నర్ ప్రసంగం, 16వ తేదీన దివంగత శాససనభ్యుడు నోముల నర్సింహయ్యకు సంతాపం ప్రకటిస్తారు. అదే రోజు బిసిఎ సమావేశాన్ని నిర్వహించనున్నారని తెలుస్తోంది. కాగా 17వ తేదీన గవర్నర్ ప్రసంగంపై చర్చ, ఆ తరువాత ధన్యవాద తీర్మానం ఉంటుంది. ఈ నెల 18 వ తేదీన అసెంబ్లీలో బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాల చివరి రోజున అప్రాప్రియేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టి సమావేశాలను ముగించనున్నారని తెలుస్తోంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టి ఒకటి, రెండు రోజులు చర్చ నిర్వహించనున్నారు. మరుసటి రోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం, తదుపరి రోజు సెలవు ఇవ్వడం, తర్వాత రోజుల్లో బడ్జెట్‌పై చర్చ, అనంతరం పద్దులపై చర్చ, ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం తదితర ప్రక్రియలు నిర్వహించాల్సి ఉంటుంది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ఈసారి కూడా శాఖలవారీగా పద్దులపై విస్తృతస్థాయి చర్చ లేకుండానే ప్రభుత్వం బడ్జెట్‌ను ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా బడ్జెట్ రూపకల్పనపై సిఎం కెసిఆర్ ఇటీవల ఆర్థిక శాఖ అధికారులతో ప్రాథమిక స్థాయిలో చర్చించి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు చేస్తున్నా ఇంకా కీలక దశకు చేరుకోలేదు. ఈ బడ్జెట్ తుది రూపంపై సిఎం కెసిఆర్ త్వరలోనే సంబంధిత అధికారులతో నాలుగైదు రోజుల పాటు సమీక్ష నిర్వహించిన అనంతరం బడ్జెట్ సైజ్‌ను ఖరారు చేయనున్నారని తెలుస్తోంది.

TS Assembly budget Session 2021 to start from March 15

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News