Wednesday, May 8, 2024

గాంధీలో ఓమిక్రాన్ జీనోమ్ సీక్వెన్సింగ్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రస్తుతం దశంలో ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన కలిగస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ దేశంలోని అన్ని రాష్ట్రాలకు మెల్ల మెల్లగా వ్యాపిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. తెలంగాణలోనూ ఒమిక్రాన్ విస్తరిస్తుంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండడంతో అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ రెండు రోజుల క్రితం ప్రత్యకంగా కిట్లు తెప్పించి గాంధీ ఆస్పత్రిలోనే ఓమిక్రాన్ జీనోమ్ సీక్వెన్సింగ్ ను ప్రారంభించింది. గాంధీ ఆసుపత్రిలో మొదటి సారి చేసిన 48 శాంపిల్స్ పరీక్షించగా.. అన్ని శాంపిల్ ఒమిక్రాన్ నెగటివ్ గా వచ్చాయి. అన్ని డెల్టా వేరియంట్ గా గుర్తించారు. కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో 24 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

TS Govt Begins Omicron Genome Sequencing Test

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News