Friday, April 26, 2024

దసరా నుంచి పనులు

- Advertisement -
- Advertisement -

 15న నూతన సచివాలయానికి టెక్నికల్ బిడ్డింగ్ 
 16 లేదా 19న టెండర్లు ఫైనల్, బరిలో 5 కంపెనీలు
 నిర్మాణ వ్యవధిని పెంచాలని గుత్తేదారుల విజ్ఞప్తి

మన తెలంగాణ/హైదరాబాద్: నూతన సచివాలయ నిర్మాణానికి సంబంధించిన టెండర్లను ఈనెల 16వ తేదీ లేదా 19వ తేదీన అధికారులు ఫైనల్ చేయనున్నారు. దసరాకు నూతన సచివాలయ నిర్మాణం ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు టెండర్లకు సంబంధించిన పనులను వేగవంతం చేశారు. అందులో భాగంగా బుధవారం (ఈనెల 7వ తేదీన) ఫ్రీ బిడ్డింగ్ నిర్వహించగా 5 కంపెనీలు పాల్గొన్నాయి. దీనికి సంబంధించి ఈనెల 15వ తేదీన టెక్నికల్ బిడ్డి ంగ్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అనంతరం ఈనెల 16వ తేదీ లేదా 19వ తేదీన టెండర్‌ను ఫైనల్ చేయనున్నట్టుగా సమాచారం. ఇప్పటికే ఈ నిర్మాణానికి సంబంధించి ప్రముఖ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఆర్ అండ్ బి డిజైన్‌తో పోలిస్తే ప్రస్తుత సచివాలయం నిర్మాణం 33 వేల చదరపు అడుగుల మేర పెరిగింది. ఈ నిర్మాణానికి మొదటగా సమారు రూ.400 కో ట్లు అవుతుందని భావించిన ప్రభుత్వం ప్రస్తుతం పెరిగిన నిర్మాణంతో అదనం గా రూ.215 కోట్లు ఖర్చు కానునుందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్లాన్స్ ప్రకారం మొత్తం జి+11 అంతస్థుల (సెల్లార్ అదనంతో) నిర్మాణమయ్యే ఈ భవనం మొత్తం విస్తీర్ణం 61,91,467 చదరపు మీటర్లుగా ఉండనుంది. మొత్తం సచివాలయం ప్రాంగణ విస్తీర్ణం 26.29 ఎకరాల నుంచి 28.05 ఎకరాలకు పెరిగింది.

అయితే పెరిగిన అంచనాలకు టెండర్‌లను ఆర్ అండ్ బి పిలవగా చాలామంది పోటీపడ్డారు. 2 ఎకరాల్లో 7 లక్షల చదరపు అడుగుల నిర్మాణం ఈ నేపథ్యంలోనే గుత్తేదారు కంపెనీ నికర విలువ రూ.750 కోట్లు ఉండాలని, ఏదైనా ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.500 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలను నిర్వహించి ఉండాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో బుధవారం (ఈనెల 7వ తేదీన) ఫ్రీ బిడ్డింగ్ నిర్వహించగా 5 ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయని తెలిసింది. అయితే ఈ నిర్మాణాన్ని 12 నెలల్లో పూర్తి చేయాలని, 24 గంటల పాటు నిర్మాణం జరుపుకోవచ్చని ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2 ఎకరాల్లో 7 లక్షల చదరపు అడుగుల నిర్మాణం చేపట్టడంతో పాటు 25 ఎకరాల్లో ల్యాండ్ స్కేపింగ్, పార్కింగ్ వంటి సదుపాయాలను 12 నెలల్లో కల్పించడం కష్టతరం అవుతుందని, తమకు సుమారుగా 15 నుంచి 18 నెలల పాటు నిర్మాణానికి అవకాశం ఇవ్వాలని ఫ్రీ బిడ్డింగ్‌లో పాల్గొన్న కంపెనీలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టుగా సమాచారం. అయితే దీనిపై త్వరలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకోనున్నట్టు ఆర్‌అండ్‌బి వర్గాలు తెలిపాయి. అయితే ఈ ప్రాజెక్టును చేజిక్కంచుకోవడానికి టాటా ప్రాజెక్టు, షాపూర్ జీ పల్లోంజీ, ఎల్ అండ్ టి, ముంబైకి చెందిన జేఎంసి ప్రాజెక్టు, యూపి ప్రభుత్వ రంగ సంస్థ ఉత్తరప్రదేశ్‌లు ఆసక్తి చూపడంతో పాటు ఫ్రీ బిడ్డింగ్‌లో పాల్గొన్నట్టుగా తెలిసింది.

TS New Secretariat Construction to begin from Dussehra

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News