Friday, May 17, 2024

ఢిల్లీలో ఇద్దరు జర్నలిస్టుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలో ఇద్దరు జర్నలిస్టుల అరెస్ట్
వ్యక్తిగత పూచీకత్తుపై ఒకరి విడుదల

న్యూఢిల్లీ: హర్యానా-ఢిల్లీ సరిహద్దు ప్రాంతం సింఘులో రిపోర్టింగ్ చేస్తున్న ఇద్దరు జర్నలిస్టులను శనివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. తమ విధులకు అంతరాయం కలిగించారని జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టయిన జర్నలిస్టులను మన్‌దీప్‌పూనియా, ధర్మేంద్రసింగ్‌గా గుర్తించారు. వీరిద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు, సింగ్‌ను వ్యక్తిగత పూచీకత్తుపై వెంటనే విడుదల చేయగా, పూనియాను రాత్రంతా సమయ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అయిన పూనియా కారవాన్ అనే పత్రిక కోసం పని చేస్తున్నారు.

ఆదివారం ఉదయం తీహార్ కోర్టులోని మెజిస్ట్రేట్ ముందు పూనియాను హాజరపరచగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. పూనియా బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనున్నది. పూనియా అరెస్ట్‌ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఖండించారు. ఆయణ్ని పోలీసుల భారీ గుంపు అరెస్ట్ చేసి తీసుకువెళ్లిన వీడియోను ట్విట్టర్‌లో రాహుల్ పోస్ట్ చేశారు. జనవరి 26 ఘటనలపై ఇప్పటికే కాంగ్రెస్ ఎంపి శశిథరూర్, ఇండియా టుడే సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ‌సహా ఆరుగురు జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. రైతులను రెచ్చగొట్టారని వారిపై అభియోగాలు మోపారు.

Two Journalists arrested in Delhi at farmers rally

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News