Monday, May 6, 2024

భాగ్యనగరంలో మరో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : భాగ్యనగరంలో మరో ఇద్దరు ఉగ్రవాదులను మద్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ (ఎటిఎస్), హైదరాబాద్ ఇంటెలిజెన్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించి బాబానగర్, చాంద్రాయణ గుట్టలో ఈ ఇద్దరు హిజ్బ్ ఉత్ తహరీర్ (హెచ్‌యుటి) మద్దతుదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో మొత్తం అరెస్టుల సంఖ్య 19కి చేరింది. అరెస్టైన వారిలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు 11 మంది., మిగిలిన ఎనిమిది మంది హైదరాబాద్‌కు చెందిన వారు. కాగా సోమవారం పట్టుబడిన ఇద్దరు ఉగ్రవాదులను స్థానిక కోర్టులో హాజరుపర్చి భోపాల్‌కు తరలించారు. అయితే దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా హైదరా బాద్‌తో ఏదో ఒక లింకు బయటపడేది. అయితే ఇటీవల కాలంలో ఈ తరహ ఘటనలు తగ్గాయి. కానీ హైదరాబాద్‌లోనే ఎనిమిది మంది ఉగ్రవాదులు అరెస్ట్ కావడం కలకలం రేపుతుంది.

నిందితులు తమ ఉనినికి బయటకు రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసు కున్నారు. డార్క్ వెబ్ సైట్లను వినియోగించారు. మరో వైపు హైదరాబాద్ గోల్కోండలో నివాసం ఉన్న హెచ్ యూటి కీలక నేత నివాసంలో వీరంతా తరచగా సమావేశాలు నిర్వహించిన విషయాన్ని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. హైదరాబాద్‌కు సమీపంలో గల అనంతగిరి గుట్టల్లో నిందితులు ఆయుధాలు, పేలుడు పదార్ధాల వినియోగంలో శిక్షణ పొందారని పోలీసులు గుర్తించారు. ఈ నెల 9వ తేదీన మధ్యప్రదేశ్ ఏటిఎస్, హైదరాబాద్ పోలీసులు 16మందిని అరెస్ట్ చేశారు. మరునాడే మరొకరిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. షాపింగ్ మాల్స్, ప్రభుత్వ కార్యాలయాలు, జనం రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో విధ్వంసం చేయాలని ఉగ్రమూకలు ప్లాన్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందని సమాచారం.

దాదాపుగా 18 మాసాలుగా నిందితులు హైద్రాబాద్‌లో తలదాచుకుంటున్నట్టుగా పోలీసులు గుర్తించారు. హైద్రాబాద్, భోపాల్ లలో డ్రోన్ల ద్వారా దాడులు చేయాలని కూడా నిందితులు ప్లాన్ చేసిన విషయాన్ని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. అయితే ఈ టీమ్ సభ్యులు మూకుమ్మడిగా కాకుండా సింగిల్ గా విధ్వంసాలు చేయాలని ప్లాన్ చేశారని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. కాగా, హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ విధ్వంసం చేయాలని నిందితులు ప్లాన్ చేశారనే విషయమై దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి. ఇప్పటికే అరెస్టైన నిందితులను మధ్యప్రదేశ్ ఎటిఎస్ టీమ్ కస్టడీలోకి తీసుకొని విచారిస్తుంది. ఎటిఎస్ టీమ్ కస్టడీలో ఉన్న నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు సోమవారం మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News