Home జాతీయ వార్తలు తీహార్ జైలులో ఖైదీల ఘర్షణ: ఇద్దరికి తీవ్ర గాయాలు

తీహార్ జైలులో ఖైదీల ఘర్షణ: ఇద్దరికి తీవ్ర గాయాలు

Two Tihar jail inmates injured after clash

న్యూఢిల్లీ: తీహార్ జైలులో తోటి ఖైదీల దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు మంగళవారం వెల్లడించారు. వేర్వేరు ఘటనల్లో గాయపడిన ఇద్దరు విచారణ ఖైదీలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని వారు తెలిపారు. రెండు ఘటనలు జైలు నెంబర్ 3లో జరిగాయని వారు తెలిపారు. ఆదివారం జరిగిన ఘటనలో వికాస్‌ధుల్ అనే ఖైదీపై వికాస్‌చోప్రా అనే మరో ఖైదీ సర్జికల్ బ్లేడ్‌తో దాడి చేశాడని వారు తెలిపారు. ధుల్ ముఖంపై గాయాలైనట్టు వారు తెలిపారు. ఇతనికి జైలులోనే చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. సోమవారం జరిగిన ఘటనలో విజయ్ అనే ఖైదీపై దినేశ్ అనే మరో ఖైదీ పదునైన వస్తువుతో దాడి చేశాడని అధికారులు తెలిపారు. విజయ్ వీపు, పిరుదులపై గాయాలయ్యాయన్నారు. విజయ్‌కి డిడియు హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నదని అధికారులు తెలిపారు.