Friday, April 26, 2024

భారత్ సహా 15 దేశాల పౌరుల రాకకు యుఎఈ గ్రీన్ సిగ్నల్

- Advertisement -
- Advertisement -

US relaxes travel restrictions to India

న్యూఢిల్లీ : రెండు డోసుల వ్యాక్సినేషన్‌ను పూర్తి చేసుకున్న భారతీయులు సహా 15 దేశాల పౌరులను సెప్టెంబర్ 12 నుంచి అనుమతిస్తున్నట్టు యునైటెండ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) ప్రకటించింది. సరైన నివాస వీసాలు ఉన్నవారు రెండు డోసులు తీసుకుంటే తిరిగి యుఎఇకి రావొచ్చని స్పష్టం చేసింది. భారత్‌తోపాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, వియత్నాం, నమీబియా, జాంబియా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సియెర్రాలియోన్, లేవీరియా, దక్షిణాఫ్రికా, నైజీరియా, అఫ్గానిస్థాన్ తదితర దేశాల పౌరులకు అనుమతి ఇచ్చింది. తమ దేశానికి రావాలనుకునే వారు రెండు డోసుల వ్యాక్సినేషన్‌తోపాటు ఆర్‌టిపిసిఆర్ నెగిటివ్ పత్రం కూడా చూపించాలని స్పష్టం చేసింది. దుబాయి ఎక్స్‌పో 2020 వరల్డ్ ఫెయిర్‌ను అక్టోబర్ 1 న నిర్వహించనున్న నేపథ్యంలో యూఎఈ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News