Friday, April 26, 2024

యుజిసి-నెట్, ఐఐఎఫ్‌టి పరీక్ష కొన్ని కేంద్రాలలో వాయిదా

- Advertisement -
- Advertisement -

UGC-NET and IIFT exam postponed at some centers

భువనేశ్వర్: జవాద్ తుపాను కారణంగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని కేంద్రాలలో ఆదివారం జరగవలసి ఉన్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-నేషనల్ ఎలిజిబిలిటి టెస్ట్(యుజిసి-నెట్), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(ఐఐఎఫ్‌టి) ఎంట్రెన్స్ టెస్ట్ వాయిదా పడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, ఒడిశాలోని పూరీ, భువనేశ్వర్, కటక్, బరంపూరం, గునుపూర్ కేంద్రాలలో యుజిసి నెట్ 2020, జూన్ 2021ను వాయిదా వేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కత, దుర్గాపూర్, ఒడిశాలోని భువనేశ్వర్, కటక్, సంబల్‌పూర్‌లోని కేంద్రాలలో ఐఐఎఫ్‌టికి చెందిన ఎంబిఎ(ఇంటర్నేషనల్ బిజినెస్ ఎంట్రెన్స్ టెస్ట్‌ను వాయిదా వేసినట్లు తెలిపింది. మళ్లీ ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని ఎన్‌టిఎ తెలిపింది. పైన పేర్కొన్న నగరాలలోని కేంద్రాలలో మాత్రమే పరీక్ష వాయిదా పడిందని, ఈ రాష్ట్రాలలోని ఇతర కేంద్రాలలో పరీక్షలు యథాప్రకారం జరుగుతాయని ఎన్‌టిఎ తెలిపింది.

UGC-NET and IIFT exam postponed at some centers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News