Monday, April 29, 2024

తెలుగింటి కోడలి పద్దులో తెలంగాణకు అన్యాయం

- Advertisement -
- Advertisement -

nirmala-sitharaman

హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లో ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశే మిగిలింది. బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టు అంశాన్నీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు, విజ్ఞప్తులు బుట్టదాఖలయ్యాయి. కనీసం నీతి ఆయోగ్ సిఫారసులను కూడా పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నివేదనలకు ఆవేదనే బదులైంది. మొత్తం బడ్జెట్‌లో పన్నుల వాటా కింద రాష్ట్రానికి రూ. 16,726 (2.13 శాతం) కోట్లపైగా చూపిన కేంద్రం… ఈసారి కూడా విభజన చట్టంలోని అంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు.

మొత్తం మీద కేంద్ర బడ్జెట్ ద్వా రా రాష్ట్రానికి ప్రయోజనం ఏమీ లేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాల్లో కూడా ని ధుల కేటాయింపులో గణనీయమైన పెరుగుదల లేకపోవడం కూడా రాష్ట్రంపై ప్రభావం ఉంటుందని రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఉపాధి హమీ పథకానికి కేటాయింపులు గత ం కంటే తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.71 వేలు సవరించిన అంచనాలు చూపినప్పటికీ, 202021 గాను రూ.61,50 0 కోట్లు చూపారు. ఏకంగా రూ.10 వేల కోట్లు తగ్గడం గమనార్హం.

కార్పొరేట్ టాక్స్ అధికం

14వ ఆర్థిక సంఘం సూచనల మేరకు కేంద్ర పన్నుల్లో 42 శాతాన్ని రాష్ట్రాలకు పంచుతూ వస్తున్నారు. అం దులో భాగంగానే రానున్న ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు పంచనున్న రూ.7,84,180.87 కోట్లలో తెలంగాణకు 2.13 శాతం వాటా కింద రూ. 16,726 కోట్లు నిధులు రానున్నాయి. కేంద్ర పన్నుల్లో అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌కు రూ.1.40 లక్షల కోట్లు లభిస్తున్నాయి. తెలంగాణ కంటే ఎక్కువ మొత్తం పొందుతున్న రాష్ట్రాల్లో ఏపీ, అ స్సాం, మధ్యప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, కేరళ ఉన్నాయి.

కాళేశ్వరం, పాలమూరు ప్రస్తావన లేదు

బడ్జెట్‌లో కేంద్రం ఒక్క రూపాయిని కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు కేటాయించలేదు. అలాగే పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టకైనా జాతీ య హోదా ఇవ్వాలని కోరినప్పటికీ కేంద్రం కనీసం ప్రస్తావించారు. మిషన్ భగీరథ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశవ్యాప్తంగా జలశక్తి పథకాన్ని ప్రవేశపెట్టిన కేంద్రం.. మన పథకానికి మాత్రం డబ్బులివ్వలేదు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వే లైన్లు లాంటి అంశాలను కూడా కేంద్రం పక్కన పడేయడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం ఆశలు పెట్టుకున్న ఏ ఒక్క పథకానికి కూడా కేంద్రం నిధులు కేటాయించకపోవడం రాష్ట్ర ఖజానాపై ప్రభావం చూపనుంది.

పసుపు బోర్డు ఏదీ ?

పన్నుల వాటా, గ్రాంట్లు తప్ప రాష్ట్రానికి కేంద్రం అదనంగా ఇస్తున్న నిధులు పెద్దగా ఏమీ లేవు. విభజన నాటి హామీలూ అమలు కాలేదు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుకు బిజెపి హామీ ఇచ్చినా ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాగే వారసత్వ కట్టడాల పరిరక్షణకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ అండ్ కన్జర్వేషన్ పథకం ప్రవేశపెట్టిన కేంద్రం తెలంగాణకు చోటు కల్పించలేదు.

union budget 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News