Friday, April 26, 2024

కరోనా చీకట్లపై కాంతిరేఖలు

- Advertisement -
- Advertisement -

cm kcr

 

మన తెలంగాణ/హైదరాబాద్ : భారతదేశంలో కరోనా వ్యాప్తి నివారణకు జరుగుతున్న ఐక్య పోరాటానికి సంఘీభావ సంకేతంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం రాత్రి ప్రగతి భవన్‌లో జ్యోతి వెలిగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి ఇచ్చిన పిలుపుమేరకు రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు కొవ్వొత్తి వెలిగించారు. కొవ్వత్తి పట్టుకుని కరోనాపై పోరాడుతున్న వారికి సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా సంఘీభావం ప్రకటించారు. ముఖ్యమంత్రితో పాటు సిఎం సతీమణి శోభ, మంత్రి కెటిఆర్ సతీమణి శైలిమా, కుమారుడు హిమాన్షు, కుమార్తె అలేఖ్య, ఇతర కుటుంబ సభ్యులు జ్యోతి వెలిగించారు. అలాగే ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లారాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగ్ రావు, రామకృష్ణరావు, శాంత కుమారి, అడ్వకేట్ జనరల్ పి.ఎస్. ప్రసాద్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్‌భవన్‌లో దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు టి.హరీష్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి,మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంఎల్‌సి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత, ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు తమ ఇళ్ల వద్ద కొవ్వొత్తులు వెలిగించి మోదీ పిలుపుకు అనుగుణంగా వ్యవహరించి దేశ ఐక్యతను చాటారు. త్రిదండి చినజీయర్ స్వామి ముచ్చింతల్లోని తమ ఆశ్రమంలో దీపం వెలిగించి సంఘీభావం తెలిపారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల నుంచి గ్రామాల్లో సైతం మోదీ పిలుపుకు విశేష స్పందన వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రజలు తమ నివాసాల్లో లైట్లు ఆపేసి కొవ్వొత్తులు, దీపపు ప్రమిదలు, టార్చి లైట్ల వెలుతురులో ప్రజలంతా కరోనా మహమ్మారి నిర్మూలనకు ప్రతినబూనారు. వివిధ పార్టీల అధ్యక్షులు, నాయకులు దేశ ఐక్యతను చాటారు. పిఎం పిలుపునకు స్పందించి డాక్టర్లు, నర్సులు కూడా కొవ్వొత్తులు వెలిగించారు.

టాలీవుడ్ హిరోలు
ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు టాలీవుడ్ హీరోలు, ఇతర ప్రముఖులు కూడా దీపాలు వెలిగించారు. హిరో నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ తమ తమ కుటుంబ సభ్యులతో కలిసి దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపారు. అలాగే పలువురు సినీ ప్రముఖలు దీపాలు వెలిగించి దేశ ఐక్యతను చాటారు.

 

United Solidarity for Prevention of Corona
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News