Monday, May 6, 2024

మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో జో బైడెన్..

- Advertisement -
- Advertisement -

US Election Results: Joe Biden nears 270 Victory Mark

అమెరికా అధ్యక్ష్య ఎన్నికల ఫలితాల్లో బైడెన్ హావా కొనసాగుతోంది.మ్యాజిక్ ఫిగర్ 270కి చేరువలో జో బైడెన్ ఉన్నారు. మిషిగన్ సహా కీలక రాష్ట్రాల్లో బైడెన్ గెలుపొందారు. బైడెన్ 253 ఎలక్టోరల్ ఓట్లు, డొనాల్డ్ ట్రంప్ 213 ఓట్లతో కొనసాగు తున్నారు. కాగా, ప్రస్తుతం 5 రాష్ట్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. పెన్సిల్వేనియా, జార్జియా, నార్త్ కరోలినాలో కౌంటింగ్ జరుగుతుండగా.. నెవాడా, అలస్కాలో ఫలితాలు తేలాల్సి ఉంది. నార్త్ కరోలినా ఓట్ల లెక్కింపులో గందరగోళం చోటుచేసు కోవడంతో అక్కడ ఈ నెల 12న పలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెన్సిల్వేనియాలో 87 శాతం కౌటింగ్ పూర్తైంది. పెన్సిల్వేనియాలో బ్యాలెట్ ఓట్లలో బైడెన్ కే ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 75 శాతం కౌంటింగ్ పూర్తైన నెవాడాలో బైడెన్ ఆధిక్యంలో ఉన్నారు. మిషిగన్, కాలిఫోర్నియా, న్యూయార్క్, అరిజోవా, మసాచుసెట్స్, మిన్నపోటా, మేరిలాండ్, కొలరాడ్, కనెక్టికట్, ఓరెగన్, ఇల్లినాయిస్, న్యూమెక్సికో, న్యూహాంప్ షైర్, రోడ్ ఐలండ్, డీసి, వెర్మాంట్, డెలవర్, హవాయి, పిస్కాన్సిన్ లో బైడెన్ ఆధిక్యంలో ఉన్నారు. ఇక, 97 శాతం కౌంటింగ్ పూర్తైన జార్జియాలో స్వల్ప ఆధిక్యంలో ట్రంప్ ఉన్నారు. వీటితోపాటు స్వింగ్ స్టేట్స్ గా పిలిచే టెక్సాస్, ఫ్లోరిడా, ఒహాయో, టెన్నెసీ, ఇండియానా, మిస్సోరి, సౌత్ కరోనాలినా, కంటెకి, లూసియానా, అలబామా, ఓక్లహామ కీలక రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యంలో కొనసాగతున్నారు.

US Election Results: Joe Biden nears 270 Victory Mark

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News