Sunday, May 12, 2024

హీషీ హక్కుల్లో మైలురాయి

- Advertisement -
- Advertisement -
US issues first gender-neutral X passport
అమెరికాలో ఎక్స్ పాస్‌పోర్టు

వాషింగ్టన్/డెన్వెర్ : అమెరికాలో తొట్టతొలి ఎక్స్ జెండర్ పాస్‌పోర్టును జారీ చేశారు. ఫోర్టు కూలిన్స్ కొలరాడోకు చెందిన డానా జిమ్ తనకు ఈ పాస్‌పోర్టు అందినట్లు సగర్వంగా తెలియచేసుకున్నారు. మగ , ఆడ కాకుండా ఉండే మానవ ప్రాణికి సంబంధించిన ఎక్స్ జెండర్‌ల హక్కుల గుర్తింపు , వారి ఆత్మగౌరవ ప్రాధాన్యత క్రమంలో భాగంగా ఈ ఎక్స్ జెండర్ గుర్తింపుతో పాస్‌పోర్టు వెలువరించడం మైలురాయి అయింది. ఇప్పటికైతే ఇటువంటిపాస్‌పోర్టును లాంఛనప్రాయంగానే జారీ చేసినట్లు, వచ్చే ఏడాది విస్తృతస్థాయిలో ఈ జెండర్‌వారికి అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు విదేశాంగ విభాగం తెలిపింది. తాము ఎవ్వరికి తొలి పాస్‌పోర్టు ఇచ్చిందనే వివరాలను విభాగం తెలియచేయలేదు. అయితే ఈ వ్యక్తినితానే అని డానా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు. తనను తాను లింగ తటస్థ రకంగా పిలుచుకోవడానికి మొగ్గుచూపే ఈ వ్యక్తి తమకు ప్రత్యేక పాస్‌పోర్టు కోసం 2015 నుంచి న్యాయచట్టపరమైన పోరు సాగిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో విజయం సాధించారు. తమ వంటి వారికి నిర్థిష్టమైన జెండర్ గుర్తింపుతో పాస్‌పోర్టులు ఇవ్వాలని, దీని ద్వారా రాబోయే తరపు ద్విలింగ వ్యక్తులకు పూర్తి స్థాయిలో హక్కులు పొందేందుకు ప్రాతిపదిక ఏర్పడుతుందని, ఇప్పుడు తనకు దక్కింది ఇందులో ప్రాధమిక గుర్తింపు అని తెలిపారు. తాను ఎప్పుడూ సమస్య కాదని, తాను మానవుడినే అని, ఇదే తమ వాదనలోని కీలక అంశం అని తేల్చిచెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News