Friday, April 26, 2024

వ్యాక్సిన్ వేసుకున్న వారికే అమెరికాలోకి అనుమతి!

- Advertisement -
- Advertisement -

US entry rules

వాషింగ్టన్: అమెరికాలోకి ప్రవేశించాలనుకున్న వారికి కొన్ని నియమాలను ఆ దేశం సడలించింది. దీంతో భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ వంటి దేశాల వారికి ప్రయోజనకరం కాగలదు. నవంబర్ 8 తర్వాత అమెరికాలోకి ప్రవేశించాలనుకునే విదేశీయులు పూర్తిగా వ్యాక్సిన్ వేసుకున్నవారై ఉండాలి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ప్రకటనపై సోమవారం సంతకం చేశారు. “అమెరికాలోకి ప్రవేశించేవారు ఎఫ్‌డిఎ ఆమోదించిన లేక ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగ జాబితా వ్యాక్సిన్లు వేసుకుని ఉండాలి” అని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ జాబితాలో భారత్ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ కూడా ఉందన్నది ఇక్కడ గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News