Friday, May 10, 2024

ముక్కలేందే ముద్ద దిగని ట్రంప్… వెజ్ తింటాడా అని అధికారుల కంగారు

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: భారతదేశంలో 36 గంటల పాటు పర్యటన చేపట్టిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తినబోయే వంటకాలపై అమెరికా అధికారులు ఆదుర్దా పడుతున్నారు. జీవితంలో ఏనాడూ కూరగాయలు ముట్టని ట్రంప్ ఈ పర్యటనలో వాటిని తిని ఎలా తట్టుకుంటారోనంటూ వారు కంగారు పడుతున్నారు. ట్రంప్ నిత్యం తీసుకునే ఫుడ్ మెనూలో స్టీక్స్, బర్గర్స్, మీట్‌లోఫ్ వంటివి ఉంటాయి. అప్పుడప్పుడు భోజనం తర్వాత సలాడ్ తీసుకునేవారు. కాని, భారత ప్రధాని నరేంద్ర మోడీ పూర్తి శాకాహారి కావడంతో ట్రంప్‌కు కూడా అదే ఆతిథ్యం లభించనున్నది. మోడీ తనకు ఎంతో ఇష్టమైన వెజిటబుల్ బర్గర్లు, తృణధాన్యాలతో చేసిన రొట్టెలు, బ్రొకోలి సమోసాలు, కొబ్బరి నీళ్లు వంటి శాకాహార వంటకాలను ట్రంప్‌కు రుచిచూపనున్నారు. తన 36 గంటల పర్యటనలో ట్రంప్ మోడీతో కలసి పలుసార్లు భోజనం చేసే అవకాశం ఉంది. మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో విందులో కూడా వీరు కలిసే పాల్గొననున్నారు. కాగా, ట్రంప్ వేరే దేశాలను సందర్శించినపుడు తప్పనిసరిగా ఆయనకు ఇష్టమైన మాంసాహార వంటకాలు మెనూలో ఉంటాయి. ట్రంప్ ఎంతగానో ఇష్టపడే మెక్‌డోనాల్డ్ రెస్టారెంట్ భారత్‌లో మాత్రం బీఫ్‌ను వడ్డించకపోవడం కూడా కొంత ఇబ్బందికరమైన విషయమే.

US officials worry over Trumps diet in India, They said that they never seen him eat vegetable

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News